Site icon HashtagU Telugu

Rudram Namaka, Chamakam: రుద్రం నమకం, చమకం యొక్క విశిష్టత..

Rudram Namaka, Chamakam

Rudram Namaka, Chamakam

కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత చతుర్థకాండంలోని పంచమ, సప్తమ ప్రపాఠకాలను ‘నమకం, చమకం’ అంటారు. రెండూ కలిపితే రుద్రం (Rudram). నమక చమకాలు స్వరబద్ధంగా చదువుతూ అభిషేకం నిర్వహి స్తారు. నమకంలో విశ్వంలోని ప్రతి అణువూ రుద్రుడే (Rudram) అని భావన చేస్తూ, ఆయా రూపాల్లో వ్యక్తమయ్యే రుద్రుడికి నమస్కారం చెయ్యటం ప్రధానాంశంగా ఉంటుంది. చమకంలో ఇందుకు భిన్నంగా భక్తుడు తన కోరికల చిట్టాను భగవంతుడి ముందు సమర్పిస్తాడు. ‘శివా! వీటన్నిటినీ నాకు అనుగ్రహించవలసింది’ అని ప్రార్థిస్తాడు. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన పేర్లతో పంచముఖాలతో నాలుగు దిక్కులను, ఊర్ధ్వదిశను చూస్తూ జగత్తును రక్షిస్తున్న రుద్రుడికి, పరమాత్మకు ఆత్మార్పణం చేస్తున్నానన్న భావనతో రుద్రాధ్యాయాన్ని పారాయణం చేస్తారు.

శివారాధనలో ప్రముఖమైన రుద్రాభిషేకాన్ని వివిధ రకాలుగా ఆచరిస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం, లఘురుద్రం, శతరుద్రీయం ఇలా శక్తిసామర్థ్యాలను బట్టి భక్తులు దీనిని నిర్వహిస్తూ ఉంటారు. నమక-చమకాల సంఖ్య ఆధారంగా వీటిని వివిధ రకాల రుద్రాభిషేకాలుగా పిలు స్తారు. శ్రీకృష్ణుడు ఒక ఏడాదిపాటు పాశుపత దీక్ష చేసి, విభూదిని వంటినిండా అలుముకొని, రుద్రాధ్యాయాన్ని పారాయణ చేశాడని కూర్మ పురాణం చెబుతున్నది. జాబాల ఉపనిషత్తులో బ్రహ్మచారులు ‘కిం జప్యేన అమృతత్వమ శ్నుతే?’ (దేనిని జపించడం వల్ల అమృతత్వం కలుగు తుంది) అని ప్రశ్నిస్తారు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ‘శత రుద్రీయం’ చేయడంతో అమృతత్వం సిద్ధిస్తుందని సమాధానం చెబుతాడు. నిత్యం రుద్రాధ్యాయాన్ని జపించే వాళ్లు ముక్తిని పొందుతారని స్మృతులు చెబుతున్నాయి. ఐహిక
భోగాలు, మోక్షం, పాప ప్రాయశ్చిత్తం కోరుకునేవారికి రుద్రుడి ఆరాధనకు మించిన మార్గం లేదు.

Also Read:  Navagraha Dosha: నవగ్రహ దోషాల నివారణకు స్నానాలు!!