Site icon HashtagU Telugu

Rama Navami:రాముడిని ఇలా కొలుస్తే…కష్టాలన్నీ తొలగిపోతాయట..!!

Ram Navami 2024

Sri Rama Navami 2016 Imresizer

మహాభారతం గురించి తెలిసినవారందరికీ రాముని గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. రామ అనే రెండు అక్షరాల రమ్యమైన పదం పలకని భారతీయుడు లేడంటే…అతిశయోక్తి కాదు. అందుకే శ్రీరామ నవమి రోజున భారతీయులందరూ ఘనంగా జరుపుకుంటారు. ప్రతిఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం..ఛైత్ర నవమి రోజున శ్రీరామ నవమి పండగను జరుపుకుంటాం. ఇదేరోజు రాముడు జన్మించాడని…అలాగే వనవాసం నుంచి కూడా అయోధ్యకు పట్టాభిషేకం జరుపుకున్నారని పెద్దలు చెబుతూంటారు.

పురాణాల ప్రకారం..శ్రీరాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధనవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడని పురాణాల్లో ఉంది. అంతటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండగగా జరుపుకుంటారు. 14ఏళ్ల అడవిలో వనవాసం చేసి..లంకలో రావణాసురుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభసమయం కూడా ఛైత్ర శుద్ధ నవమి రోజే జరిగిందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతిఏడాది చైత్రమాసంలో ఉగది పండగ తర్వాత సరిగ్గా తొమ్మిదిరోజులకు శ్రీరామ నవమిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10న ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజు దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కల్యాణం జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీరామ నవమి శుభముహుర్తం ఎప్పుడు వచ్చింది. ఇంట్లో ఏ సమయంలో పూజలు చేయాలి. ఎలాంటి మంత్రాలు జపించాలి. రాముడిని ఎలా ఆరాధించాలన్న విషయాలను తెలుసుకుందాం.

ముహుర్తం ఎప్పుడంటే…
హిందూ పంచాంగం ప్రకారం 2022లో ఏప్రిల్ 10న ఆదివారం నాడు శ్రీరామ నవమి పండగను జరుపుకుంటారు. ఈ శుభముహుర్తం ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 1:39 గంటల వరకు ఉంటుంది. అంటే దాదాపు 2 గంటల 33 నిమిషాల పాటు ఉంటుంది. ఈ వ్యవధిలోనే శ్రీ సీతారాముల వారి కల్యాణం జరిపించాలి.
ఏప్రిల్ 10న అర్థరాత్రం 1:23 గంటలకు నవమి తిథి ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు నవమి తిథి ముగుస్తుంది.
సూర్యోదయానికి ముందే…
నవవి రోజున ఉదయాన్నే అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత పసుపు లేదా పచ్చని రంగులో బట్టలు వేసుకోవాలి. దేవుని గదిలో పువ్వులతో అందంగా అలంకరించాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. గడపకు బొట్లు పెట్టి…ఇంటి ముందు ముగ్గును వేయాలి.

రాముడితోపాటు…
చరిత్రను చూస్తే..ఛైత్రమాసంలో తొమ్మిదో రోజు నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కౌసల్యకు జన్మించాడు. తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రఘ్నులు జన్మించారు. ఈ నలుగురు ఉన్న ఫోటోలన పువ్వులతో అలంకరించాలి. భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో వడపప్పు, పానకం ఉండాలి.

పట్టాభిషేకం…
శ్రీరామ నవమి తర్వాత రాముని రక్ష స్తోత్రం లేదా శ్రీరామ సహస్రం, శ్రీరామ అష్టోత్తరం వంటి స్తోత్రాలను పఠించాలని పురాణాల్లో ఉంది. అనంతరం రాముని పట్టాభిషేకం కథను చదివినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

సకాలంలో పనులు పూర్తి…
ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతరామే శ్రీరాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడని పురాణాల్లో ఉంది. ఈ సందర్భంగా శ్రీరామ నవమి రోజున దేవాలయాల్లో శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని జరిపిస్తే…అన్ని శుభ ఫలితాలే కలుగుతాయట.

మధ్యాహ్నం సమయంలో…
శ్రీరామ నవమి ఎండా కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. అందుకే రాముడిది సూర్యవంశం అని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరామునికి పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు పూజ చేసే సమయంలో రెండు దీపారధనలు, కంచు దీపంతో ఐదు పత్తితో తయారు చేసిన వత్తులను వెలిగించితే మంచిది.
ఇక పూజా సమయంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే…సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే…విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని నమ్ముతుంటారు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం ఛైత్ర శుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నలో మధ్యాహ్నం సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే కౌసల్య పుత్రుడిగా భూమిపై జన్మించాడని నమ్ముతూ ఈ శ్రీరామ నవమిని జరుపుకుంటారు.

Exit mobile version