Navratri 2023 : రేపటి నుంచే దేవీ నవరాత్రులు.. అమ్మవారికి సమర్పించాల్సిన నవ నైవేద్యాలివీ..

Navratri 2023 : దేవీ నవరాత్రులు.. రేపటి (అక్టోబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు అక్టోబర్ 23న ముగుస్తాయి. 24న దసరా (విజయదశమి) పండుగను జరుపుకుంటారు.

  • Written By:
  • Updated On - October 14, 2023 / 08:23 AM IST

Navratri 2023 : దేవీ నవరాత్రులు.. రేపటి (అక్టోబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు అక్టోబర్ 23న ముగుస్తాయి. 24న దసరా (విజయదశమి) పండుగను జరుపుకుంటారు. నవరాత్రుల వేళ దుర్గామాత భూలోకానికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తుందని నమ్ముతారు. అందుకే దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తూ.. ఉపవాస దీక్షలను పాటిస్తారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రులను భిన్నంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తారు. పదో రోజున విజయ దశమి వేడుకలను జరుపుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తిథి ప్రారంభం, ముగింపు.. 

దేవీ నవరాత్రులకు సంబంధించిన తిథి ఈరోజు (అక్టోబర్ 14) రాత్రి 11:24 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది రేపు (అక్టోబర్ 15) 12:24 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం.. ఈసారి శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15 నుంచే ప్రారంభం అవుతాయి. నవరాత్రుల్లో భాగంగా తొలిరోజున కలశ స్థాపన చేస్తారు. కలశ స్థాపనకు ఉదయం 11:44 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సమయం శుభప్రదంగా ఉంటుంది.

బెజవాడ దుర్గమ్మ అలంకారాలు..

తెలుగు రాష్ట్రాల్లో అశేష భక్తుల పూజలు అందుకుంటున్న బెజవాడ దుర్గమ్మ ఏ రోజు ఏ అవతారాల్లో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబరు 15న బాల త్రిపుర సుందరీదేవి, 16న గాయత్రీ దేవి, 17న అన్నపూర్ణా దేవి, 18న శ్రీ మహాలక్ష్మీ దేవి, 19న శ్రీ మహా చండీ దేవి, 20న శ్రీ సరస్వతీ దేవి, 21న లలితా త్రిపుర సుందరీ దేవి, 22న దుర్గా దేవి, 23న మహిషాసుర మర్దినీ దేవి, దశమి రోజున శ్రీ రాజ రాజేశ్వరీ దేవి రూపాల్లో బెజవాడ దుర్గమ్మ దర్శనమిస్తారు. అనంతరం క్రిష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుంది.

అమ్మవారికి ఏ రోజు.. ఏ నైవేద్యం.. 

మొదటి రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను, కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. రెండవరోజు అమ్మవారికి బంగారు వర్ణపు వస్త్రాలతో పూజించి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. మూడోరోజు అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆరోజున అమ్మవారికి బంగారు వస్త్రాలతో అలంకరణ చేసి వివిధ రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించాలి. నాలుగో రోజున అమ్మవారికి కాషాయం రంగు వస్త్రాలను, గారెలను నైవేద్యంగా సమర్పించాలి. ఐదో రోజున అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలను, దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి. ఆరో రోజున అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించి కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఏడో రోజున అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాలను సమర్పించి కదంబం నైవేద్యంగా సమర్పించాలి. ఎనిమిదో రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రాలు సమర్పించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. తొమ్మిదో రోజున అమ్మవారికి నీలి రంగు వస్త్రాలు, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

పూజా విధానం.. 

దేవీ నవరాత్రుల వేళ తొలిరోజున దుర్గా మాతను పూజించడానికి ముందు ఉపవాస దీక్షను ప్రారంభించాలి. శుభ ముహుర్తంలో పద్ధతుల ప్రకారం కలశ స్థాపన చేయాలి. దుర్గా మాతకు ఇష్టమైన పండ్లు, పువ్వులను సమర్పించాలి. దుర్గా దేవి మంత్రాలను (Navratri 2023)  పఠించాలి. ఇదేవిధంగా 9 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించాలి. ఆ తర్వాతే ఉపవాస దీక్షను విరమించాలి.

Also Read: Bathukamma 2023 : బతుకమ్మ వేడుకలకు వేళాయె.. 9 రోజుల పూల పండుగ విశేషాలివీ