Omicron Fear: స్కూళ్లకు పంపాలా.. వద్దా.. అయోమయంలో పేరెంట్స్!

ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. మళ్ళీ లక్డౌన్ వచ్చే అవకాశముందని, గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని ఎవరికితోచింది వారు చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించడం ద్వారా ఓమిక్రాన్ ను జయించగలమని వైద్యులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. మళ్ళీ లక్డౌన్ వచ్చే అవకాశముందని, గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని ఎవరికితోచింది వారు చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించడం ద్వారా ఓమిక్రాన్ ను జయించగలమని వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే మళ్ళీ మొదలవుతున్న వేళ ఓమిక్రాన్ దెబ్బతో పిల్లలని స్కూల్స్ కి పంపాలా వద్దా అని సతమవుతున్నారు.

గతంతో పోల్చితే ఈసారి ఎక్కువగా విద్యాసంస్థల్లో కోవిడ్ క్లస్టర్స్ నమోదవుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓమిక్రాన్ సోకినవాళ్లలో పదిశాతం పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇండియా లాంటి దేశాల్లో ఇంకా పిల్లలకి వాక్సిన్స్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ కాలేజీలు నడుస్తాయా, మూసేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులు మూతబడి ఇప్పుడిప్పుడే స్కూల్స్ రీఓపెన్ అవుతున్న స్కూల్స్ మళ్ళీ మూసేస్తే తల్లితండ్రులనుండే వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం స్కూళ్లను మూసే ఆలోచన చేయడం లేదు.

Also Read: పాపం బాబు.! బాల‌య్య క‌న్నీళ్ల క‌థ‌!!

చాలామంది పిల్లలకి కరోనా వచ్చి పోవడం వల్ల పిల్లల్లో యాంటీ బాడీస్ ఉండడంతో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఓమిక్రాన్ తో పిల్లల్లో మైల్డ్ సింటమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే వేరే ఇతర రోగాలుండీ కరోనా సోకిన కొమార్బిడిటి కేసుల్లో మాత్రం జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.

స్కూల్ పిల్లల్లో కరోనా లక్షణాలుంటే టీచర్లు గుర్తించి వెంటనే టెస్ట్ చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. క్రౌడెడ్ గా ఉన్న రూముల్లో పాఠాలు చెప్పకుండా ఓపెన్ ప్లేసుల్లో పాఠాలు చెపితే కొత్త క్లస్టర్స్ ఏర్పడకుండా కట్టడిచేయగలమని, పిల్లలకు క్రమం తప్పకుండా మంచి పౌష్టికాహారం అందించాలని పిడియాట్రిషన్స్ సూచిస్తున్నారు.

Also Read: ఔను! వాళ్లిద్ద‌రూ చెరోదారి!!

స్కూల్స్ మూతపడకుండా ఉండాలంటే ప్రభుత్వం, తల్లితండ్రులు, స్కూల్ యాజమాన్యంలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరం సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుందామా? బాధ్యతారాహిత్యంతో పిల్లల పాఠాలను ఆపుదామా అని అందరం ఆలోచించుకోవాల్సిన సమయం ఇది.