GPS – Toll Collection : ఇక జీపీఎస్ ఆధారిత టోల్​ కలెక్షన్.. ఎలాగో తెలుసా ?

GPS - Toll Collection : దేశంలో రోడ్ల విస్తరణ అనంతరం టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Gps Toll Collection

Gps Toll Collection

GPS – Toll Collection : దేశంలో రోడ్ల విస్తరణ అనంతరం టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. త్వరలో వీటికి కాలం చెల్లనుంది. వాటి  స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం చకచకా సన్నాహాలు చేస్తోంది. జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలు.. ఆటోమేటిక్‌గా వాహనం యొక్క నెంబర్ ప్లేట్ ను గుర్తిస్తాయి. అటువంటి టెక్నాలజీతో జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వ్యవస్థలను రెడీ చేశారు.  ఇందులో భాగంగా హైవేలపై నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలు ఓ వాహనం రోడ్డెక్కినప్పటి నుంచి అది హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తుందో గుర్తిస్తాయి. ఆ వాహనం ఎంతదూరం ప్రయాణించింది ?  ఎన్ని టోల్ ప్లాజాలు దాటింది ? అనే సమాచారాన్ని నిక్షిప్తం చేసి, దాని ఆధారంగానే టోల్ ఛార్జీని విధిస్తాయి.  ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీపీఎస్ వ్యవస్థను తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఆరు నెలల్లో ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయాలని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

We’re now on WhatsApp. Click to Join

ఇక అవాంతరాలు లేని ప్రయాణం

ఇప్పటివరకు వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఫిక్స్ డ్ చార్జీలను చెల్లించాల్సి వచ్చేది. జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థకు(GPS – Toll Collection) వాహన డ్రైవర్ బ్యాంక్ అకౌంటును లింక్ చేస్తారు. తద్వారా ఆటోమేటిక్‌గా టోల్ ఫీజు అతడి అకౌంట్ నుంచి కట్ అవుతుంది. దీనివల్ల వాహనదారులు  టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు.  దీనివల్ల ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణం చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. చిన్న చిన్న దూరాలకూ ఎక్కువ మొత్తంలో టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇకపై ఆ మేరకు భారం తగ్గినట్టే.  electronic payment system ద్వారా ఆటోమెటిక్‌గా మనీ డెబిట్ అవుతుంది. ఫలితంగా ఎక్కువ సేపు టోల్‌ ప్లాజాల వద్ద ఎదురు చూడాల్సిన తిప్పలు తప్పుతాయి.

Also Read :Baby In Oven : ఓవెన్‌లో పసికందును పెట్టిన తల్లి.. ఎందుకు ? ఏమైంది ?

2018-19 సంవత్సరం మధ్య కాలంలో టోల్‌ ప్లాజాల వద్ద యావరేజ్ వెయిటింగ్ టైమ్ 8 నిమిషాలుగా ఉంది. FASTags ని అమల్లోకి తీసుకొచ్చాక 2020-21, 2021-22 మధ్య కాలంలో ఈ వెయిటింగ్ టైమ్ 47 సెకన్లకు తగ్గింది. 2021లో ఈ ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఫాస్టాగ్‌లకు అదనంగా అమలు చేయనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) సంస్థకు టోల్ ఫీజుల రూపంలో ఏడాదికి రూ.40 వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. రానున్న రెండు, మూడేళ్లలో అది రూ.1.40 లక్షల కోట్లకు పెరగనుంది.

  Last Updated: 11 Feb 2024, 07:43 PM IST