అన్న‌దాత‌కు జ‌గ‌నన్న నిర్ల‌క్ష్యం పోటు ..5ల‌క్ష‌ల మంది రైతుల‌కు `పీఎం కిసాన్` ఔట్‌

జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం,..బ్యాంక‌ర్ల నిర్వాకం.. రైతుల అవ‌గాహ‌న‌లేమి..సాంకేతిక త‌ప్పిదాలు...వెర‌సి కేవ‌లం 29శాతం రైతులు మాత్ర‌మే పీఎం కిసాన్ స‌మ్మాన్ యోజ‌న ప‌థ‌కం కింద సంపూర్ణంగా ల‌బ్దిపొందారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:19 PM IST

జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం,..బ్యాంక‌ర్ల నిర్వాకం.. రైతుల అవ‌గాహ‌న‌లేమి..సాంకేతిక త‌ప్పిదాలు…వెర‌సి కేవ‌లం 29శాతం రైతులు మాత్ర‌మే పీఎం కిసాన్ స‌మ్మాన్ యోజ‌న ప‌థ‌కం కింద సంపూర్ణంగా ల‌బ్దిపొందారు. ఒక్కో విడ‌త రూ. 2వేల చొప్పున మూడు విడ‌త‌లుగా ఆ ప‌థ‌కం కింద ఏడాదికి 6వేలు బ్యాంకు ఖాతాల్లో రైతుల‌కు జ‌మ అవుతోంది. అర్హులైన రైతులందరికీ అందాల్సిన ఈ ప‌థ‌కం కేవ‌లం 29శాతం మంది మాత్రమే 2018 నుంచి ఇటీవ‌ల వ‌ర‌కు ల‌బ్ది పొందారు. వాస్త‌వంగా ఈ ప‌థ‌కం కింద అర‌కొర‌గా 56ల‌క్ష‌ల మంది ల‌బ్ది పొందార‌ని లిబ్ టెక్ ఇండియా చేసిన అధ్య‌య‌నంలో తేలింది.
రాష్ట్రంలో రైతు భ‌రోసా , కేంద్రంలో పిఎం కిసాన్ స‌మ్మాన్ యెజ‌న కింద ప్ర‌తి ఏడాది స‌న్న‌, చిన్న‌కారు రైతుల‌కు 13వేల 5వంద‌లు ఇస్తున్నారు. కౌలు రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నేరుగా 13వేల 5వంద‌ల‌ను ఇస్తోంది. స‌న్న‌, చిన్న‌కారు రైతుల‌కు మాత్రం కేంద్రం ఇచ్చే 6వేలు పోను మిగిలిన మొత్తాన్ని జ‌త చేసి రైతు భ‌రోసా కింద రాష్ట్ర ఇస్తోంది. పీఎం కిసాన్ యోజ‌న కింద 2018 డిసెంబ‌ర్ నుంచి జూన్ 2021 వ‌ర‌కు ఎనిమిది విడ‌త‌లు కేంద్రం ఇచ్చింది. మొత్తం 56.37ల‌క్ష‌ల మంది రైతులు ఈ ప‌థ‌కం కింద అర్హులుగా కేంద్రం గుర్తించింది. వారికి ఇప్ప‌టి వ‌ర‌కు 8082.9 కోట్ల‌ను జమ చేసింది. అర్హులైన మొత్తం రైతుల్లో న‌గ‌దు పొందిన రైతులు 71శాతం మాత్ర‌మే. మిగిలిన వాళ్లు ఎనిమిది విడ‌త‌ల న‌గ‌దును వివిధ కార‌ణాల‌తో పొంద‌లేక‌పోయారు.
రాష్ట్రా ప్ర‌భుత్వం అందించిన జాబితా ప్ర‌కారం 1.6శాతం అంటే 90,193 మందిని అన‌ర్హులు. ఎనిమిది విడ‌త‌లు ‌తలు ల‌బ్ది పొందిన రైతులు 29 శాతం అంటే సుమారుగా 16.61ల‌క్ష‌లు ఉన్నారు. మిగిలిన రైతులకు కొన్ని విడ‌తలుగా అందాల్సిన మొత్తం సుమారు 1092.2 కోట్లని అధ్య‌య‌నంలో తేల్చారు. అర్హులుగా గుర్తించిన రైతుల్లో ఇప్ప‌టికీ 7శాతం అంటే 4ల‌క్ష‌ల 17వేలా 212 మంది ఎలాంటి ల‌బ్ది 2018 నుంచి పొంద‌లేదు. 2019 నాటికి వాళ్ల‌లో చాలా మంది ఈ ప‌థ‌కం కింద రిజిస్ట్ర‌ర్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జా సేవ‌లు అందుతోన్న తీరుపై ఇటీవ‌ల‌ లిబ్ ఇండియా ప్ర‌తినిధులు స్టడీ చేశారు. విశాఖ‌, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావ‌రి, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లో అధ్య‌య‌నం జ‌రిగింది. ప్ర‌తి జిల్లాలో 5శాతం అంటే 2.85ల‌క్ష‌ల మందిని క‌లిసి ఈ అధ్య‌య‌నం చేసిన‌ట్టు కంపెనీ వెల్లడించింది.
ఆ కంపెనీ చేసిన అధ్య‌య‌నం ప్ర‌కారం బ్యాంకుల తిర‌స్క‌ర‌ణ‌తో పాటు వివిధ కార‌ణాలను చూపుతూ 46శాతం మంది అంటే 7ల‌క్ష‌ల 67వేలా 940 మంది రైతులు ఈ ప‌థ‌కాన్ని అందుకోలేక‌పోయారు. రాష్ట్రం నుంచి స‌కాలంలో స్పంద‌న లేక‌పోవ‌డంతో 4ల‌క్ష‌ల 89ఏల 480 మంది రైతులు ఈ ప‌థ‌కం కింద ల‌బ్దిదారులు కాలేక‌పోయారు. ఆధార్ కార్డు స‌రితూగ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో రూ. 98.6కోట్ల పంపిణీ ఆల‌స్యం అయింది. బ్యాంకులు, రాష్ట్రం నిర్ల‌క్ష్యం కార‌ణంగా మూడు నుంచి 18 నెల‌ల పాటు ల‌బ్దిదారుల ఎంపిక పెండింగ్ ప‌డింది. సాంకేతిక కార‌ణాల‌తో బ్యాంకులు న‌గ‌దు చెల్లింపుల‌ను ఆల‌స్యం చేశాయ‌ని రీసెర్చ‌ర్స్ నిగ్గు తేల్చింది.
పెండింగ్ లో ఉన్న అంశాల‌ను ప‌రిష్కారం ఎలా చేసుకోవాలో తెలియ‌ని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అన‌ర్హులుగా ఎందుకు అయ్యారో…తెలుసుకోవానికి అవ‌కాశం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రం వ‌ద్ద ఉన్న డేటాను ఇవ్వ‌డం ద్వారా అర్హుల‌ను గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అధ్య‌య‌నం ద్వారా స్ప‌ష్టం అవుతోంది.

Follow us