AP Debts : ఏపీ అప్పుల్లో ఇదీ నిజం! ఆర్బీఐ సంచ‌ల‌న నివేదిక‌!

`ఏపీ మ‌రో శ్రీలంక మాదిరిగా మారింది. ఆర్థికంగా చితికి పోయింది. జ‌గన్మోహ‌న్ రెడ్డి ప‌ప్పు బెల్లాల్లా అప్పులు తీసుకొచ్చి డ‌బ్బులు పంచుతున్నారు.

  • Written By:
  • Updated On - November 28, 2022 / 04:10 PM IST

`ఏపీ మ‌రో శ్రీలంక మాదిరిగా మారింది. ఆర్థికంగా చితికి పోయింది. జ‌గన్మోహ‌న్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి  ప‌ప్పు బెల్లాల్లా డ‌బ్బులు పంచుతున్నారు. ఇక ఏపీని ఎవ‌రూ బాగుచేయ‌లేరు. ` అంటూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన అప్పుల మీద విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. దానిలో వాస్త‌వ‌మెంత‌? అనే దానికి స‌మాధానం ఇస్తూ ఆర్బీఐ అధికారికంగా ఆయా రాష్ట్రాల అప్పుల జాబితాను విడుద‌ల చేసింది. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఏపీ కంటే ఎక్కువ‌గా అప్పులు చేసిన రాష్ట్రాలు ఏడు ఉండ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యమంత్రి జగన్ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ఏపీ కి ఉన్న మొత్తం అప్పులు రూ 3,98,903 కోట్లని ఆర్బీఐ తేల్చింది. ఆ మొత్తంలో టీడీపీ ప్రభుత్వం అప్పగించి వెళ్లిన అప్పు రూ 2,70,421 కోట్లుగా ఉంది. అంటే జగన్ హయాంలో చేసిన అప్పు రూ 1.28 లక్షల కోట్లుగా ఆర్బీఐ ధ్రువీక‌రించింది. 2019లో ఎన్నికల షెడ్యూల్ తరువాత కూడా నాటి టీడీపీ ప్రభుత్వం ఆరు వేల కోట్ల అప్పులు చేసింద‌ని ఆర్బీఐ గుర్తించింది.

Also Read:  AP Politics: తెలుగుదేశంలో `జ‌న‌సేన` ముస‌లం

రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన దాని ప్ర‌కారం ఏపీ చేసిన అప్పు రూ. 1.28కోట్ల‌లో స్టేట్ డెవలప్ మెంట్ రుణం రూ 2, 63, 483 కోట్లుగా ఉంది. విద్యుత్ బాండ్ల ద్వారా రూ 8,256 కోట్లు సేకరించింది. ఇతర బాండ్ల ద్వారా రూ 1,500 కోట్ల సమీకరించినట్టు నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. నేషనల్ సెక్యరిటీ ఫండ్ ద్వారా రూ 8,945 కోట్లు, ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ ద్వారా రూ 1,500 కోట్లు సమీకరించారు. బ్యాంకులు, నాబార్డు, ఇతర ఆర్దిక సంస్థల నుంచి రూ 6,799 కోట్లు పొందారు. మొత్తంగా అంతర్గత రుణం 2,90,483 కోట్లుగా నిర్దారించారు. కేంద్ర రుణాలు, అడ్వాన్సుల కింద 22,339 కోట్లు, ప్రొవిడెంట్ ఫఫండ్ కింద 20,917 కోట్లు, డిపాజిట్ అడ్వాన్సుల కింద 65,114 కోట్లు, కంటెన్ జెన్సీ ఫండ్ నుంచి 50 కోట్లు రుణాలుగా ఏపీ పొందింది. మొత్తంగా 3 లక్షల 98 వేల 903 కోట్లు రాష్ట్ర అప్పుగా ఉంద‌ని ఆర్బీఐ నిర్థారించింది.

ఆర్బీఐ నివేదిక ప్ర‌కారం 2022, మార్చి 31 నాటికి తమిళనాడు అత్య‌ధికంగా 6,59,869 కోట్లు అప్పు ఉంది. ఉత్తర ప్రదేశ్ 6,53,308 కోట్లు, మహారాష్ట్ర 6,09, 000 కోట్లు అప్పు చేసిన‌ట్టు నిర్దార‌ణ అయింది. ఇక‌ పశ్చిమ బెంగాల్ కు 5,62,698 కోట్లు, రాజస్థాన్ 4,77,177 కోట్లు అప్పు చేసిన‌ట్టు తేలింది. రాజస్ఘాన్ కు 4,77, 177 కోట్లు ఉండగా, కర్ణాటకకు రూ 4,61,833 కోట్లు రుణం ఉన్నట్లుగా నివేదికలో ఉంది. గుజరాత్ కు రూ 4,02,785 కోట్ల అప్పు ఉండగా, ఆ తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రూ 3,98,903 కోట్ల అప్పు చేసి ఎనిమిదో స్థానంలో ఉంది. అప్పుల్లో ఎక్కవ మొత్తం పేదల సంక్షేమం, తద్వారా వారి నుంచి తిరిగి ఉత్పత్తి సామర్ధ్యం కోసం వినియోగించేలా వ్యవహరిస్తున్నామని ఏపీ స‌ర్కార్ చెబుతోంది.

Also Read:  Amaravati Protests: ఢిల్లీకి అమరావతి రైతులు.. డిసెంబర్ 17,18న జంతర్ మంతర్ లో మహాధర్నా..!