Site icon HashtagU Telugu

CBN Option in Act : చంద్ర‌బాబుకు అస్త్రంగా CRPC సెక్ష‌న్ 482

Cbn Option In Act

Cbn Option In Act

CBN Option in Act : క్వాష్ పిటిష‌న్ అంటే క్రిమిన‌ల్ ప్రొసీడింగ్ ల‌ను ర‌ద్దు చేయ‌డానికి ఉప‌యోగించే అస్త్రం. దాన్ని సీఆర్ పీసీ సెక్ష‌న్ 482 కింద 1973లో చూపించారు. ఆధారాలు లేకుండా క్రిమిన‌ల్ కేసుల‌ను పెడితే క్వాష్ పిటిష‌న్ ద్వారా సెక్ష‌న్ 482 ప్ర‌కారం ర‌క్షించుకోవ‌డానికి భార‌తీయ‌శిక్షాస్మృతిలో పొందుప‌రిచారు. కింది కోర్టు ఇచ్చిన ప్రొసీడిగ్స్ ను హైకోర్టు కొట్టివేయ‌డానికి అవ‌కాశం ఉంది. కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా చ‌ట్టంలో పొందుప‌రిచారు. వాటి ప్ర‌కారం హైకోర్టు క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్ ను ఆపేయ‌డానికి అవ‌కాశం ఉంది.

క్వాష్ పిటిష‌న్ అంటే క్రిమిన‌ల్ ప్రొసీడింగ్ ల‌ను ర‌ద్దు చేయ‌డానికి (CBN Option in Act)

క్యాష్ పిటిష‌న్ మీద వాద‌న‌లు చేస్తోన్న చంద్ర‌బాబు త‌ర‌పు న్యాయ‌వాదులు గ‌తంలోని తీర్పుల‌ను రివీల్ చేస్తున్నారు. వాటిలో ప్రశాంత్ భారతి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ NCT ఆఫ్ ఢిల్లీ కేసును ఉద‌హ‌రిస్తున్నారు. ఆ కేసు నెంబ‌ర్ (2013) 9 SCC 293 చూపించారు. నిందితుడి నేప‌థ్యం ఈ పిటిష‌న్ మీద వాద‌న‌కు బ‌లంగా ఉప‌యోగిస్తారు. అంతేకాదు, కేసులోని నిరాధార ఆరోప‌ణ‌ల‌ను కోడ్ చేస్తారు. సుప్రీం కోర్టు కూడా కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సెక్ష‌న్ 482 కింది( CBN Option in Act) పాటించాల‌ని సూచించింది. వాటి ప్ర‌కారం ఆధారాల్లేని కేసుల‌కు సంబంధించిన క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్ ను ర‌ద్దు చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని హ‌రీశ్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా వాద‌న‌ల‌ను హైకోర్టు ముందు ఉంచారు.

ఎఫ్ ఐఆర్ లేకుండా చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన అంశాన్ని

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 320లోని నిబంధనల ద్వారా న్యాయ‌స్థానం నిర్ణ‌యం తీసుకుంటుంది. సెక్షన్ 482 ప్రకారం (CBN Option in Act) నేరం కాంపౌండబుల్ కానప్పటికీ రద్దు చేసే అధికారం ఉంది. సెక్షన్ 482 కింద తన అధికార పరిధిని ఉపయోగించి క్రిమినల్ ప్రొసీడింగ్ లేదా ఫిర్యాదును రద్దు చేయాలా వద్దా అనే అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో, న్యాయస్థానం ఎలా వ్య‌వ‌హ‌రించింది అనే దానిపై హైకోర్టు తప్పనిసరిగా విశ్లేషించాలి. కింది కోర్టు చేసిన దుర్వినియోగాన్ని ప‌రిశీలించాలి. ఎఫ్ ఐఆర్ లేకుండా చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన అంశాన్ని ప్ర‌ధానంగా న్యాయ‌వాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయ‌న్ను అరెస్ట్ చేసిన త‌రువాత ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయ‌డాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే, సెక్ష‌న్ 482 ప్ర‌కారం క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్ ను ఆపేయాల‌ని వాద‌న‌లు వినిపించారు.

దోషిగా నిర్ధారించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లయితే

సెక్ష‌న్ 482 ప్ర‌కారం (CBN Option in Act)స‌మాజంపై ప్ర‌భావం ప‌డే కేసుల‌ను విచార‌ణ‌కు ఇవ్వాల‌ని కూడా మార్గ‌ద‌ర్శ‌కాల్లో చూపారు. కమర్షియల్, ఫైనాన్షియల్, మర్కంటైల్, పార్టనర్‌షిప్ లేదా సారూప్య లావాదేవీల నుండి ఉత్పన్నమయ్యే నేరాలకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఇరు ప‌క్షాల ఇష్ట‌ప‌డితే ర‌ద్దు చేయ‌డానికి అవకాశం ఉంది. దోషిగా నిర్ధారించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లయితే లేదా నిగూఢ ఉద్దేశ్యాలతో దాఖలు చేసినట్లయితే క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్ ను నిలిపివేసే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సుప్రీం కోర్టు తెలియ‌చేసింది.

Also Read : The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంపై ఇన్ఫోసిస్ చీఫ్ సుధామూర్తి రివ్యూ

బి ఎస్ జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2003 (4) ఎస్‌సిసి 675లో, సెక్షన్ 482 సిఆర్‌పిసి కింద సెక్షన్ 482 సిఆర్‌పిసి కింద ఉన్న అధికారాలను ఉపయోగించడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఆ కేసును కూడా కోడ్ చేస్తూ చంద్ర‌బాబు త‌ర‌పున న్యాయ‌వాదులు వాదించారు. ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణలకు ఆధారాలు లేక‌పోతే నిందితులపై కేసు నమోదు చేయకూడదు. సెక్షన్ 155 పరిధిలోని మేజిస్ట్రేట్ ఆదేశం ప్రకారం తప్ప, కోడ్‌లోని సెక్షన్ 156(1) కింద పోలీసు అధికారుల దర్యాప్తును సమర్థిస్తూ నేరం (CBN Option in Act) ఆధారాల‌ను చూప‌లేక‌పోతే సెక్షన్ 155(2)లోని సెక్షన్ ప్రకారం పోలీస్ దర్యాప్తును హైకోర్టు అనుమతించదు.

Also Read : Pawan Kalyan: జనసేనకు గ్లాస్ గుర్తు, ఎన్నికల సంఘానికి పవన్ కృతజ్ఞతలు!

క్రిమినల్ ప్రొసీడింగ్‌ల కొనసాగింపుకు వ్యతిరేకంగా చట్టపరమైన అడ్డంకి ఉన్నా, ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలను నేరంగా పరిగణించబడవు.ఆ ఆరోప‌ణ‌ల‌కు నిరూపించే ఆధారాలు లేన‌ప్పుడు R P కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1960 AIR 862 కేసు ప్ర‌కారం క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయవచ్చని భారత సుప్రీంకోర్టు పేర్కొంది. ఇవే వాద‌న‌ల‌ను హ‌రీశ్ వినిపిస్తున్నారు. అంటే, సెక్ష‌న్ 482 సీఆర్పీసీ చంద్ర‌బాబును క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు తీసుకొస్తుంద‌ని ఆయ‌న త‌ర‌పు లాయ‌ర్లు విశ్వ‌సిస్తూ బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించారు.

Exit mobile version