AP Workers’ Union: ప్ర‌భుత్వ‌ బ‌కాసురులు.! జ‌గ‌న్ కు ఛాలెంజ్..జ‌నంకు భారం.!!

ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేలా మాట్లాతున్నారు. వాళ్ల డిమాండ్ల‌కు, మాట‌ల‌కు పొంత‌న లేకుండా ఉంది. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీ జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌ని బండి శ్రీనివాస‌రావు, బొప్ప‌రాజు అంటున్నారు. గ‌త 40ఏళ్ల‌లో ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ లేద‌ని చెబుతున్నారు.

  • Written By:
  • Updated On - December 8, 2021 / 01:25 PM IST

ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేలా మాట్లాతున్నారు. వాళ్ల డిమాండ్ల‌కు, మాట‌ల‌కు పొంత‌న లేకుండా ఉంది. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీ జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌ని బండి శ్రీనివాస‌రావు, బొప్ప‌రాజు అంటున్నారు. గ‌త 40ఏళ్ల‌లో ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ లేద‌ని చెబుతున్నారు. ఇంకో వైపు 71 డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచుతున్నారు. వాటిలో పీఆర్సీ, డీఏల పెంపును ప్ర‌ధాన అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఉద్యోగుల కోరిక‌ల‌కు అనుగుణంగా జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటే..వేల కోట్ల రూపాయ‌ల భారం ప్ర‌భుత్వం మీద ప‌డుతోంది. ఆ మొత్తాన్ని ప‌న్నులు రూపంలో ప్ర‌జ‌లు భ‌రించాలి.
సామాన్యుల జీవితం ఎలా ఉన్నా..త‌మ‌కు మాత్రం సౌక‌ర్యాలు కావాల‌ని కొంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు. వాళ్ల ఆలోచ‌న‌కు అనుగుణంగా ఉద్యోగ సంఘాల నేత‌లు నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌త్యేకించి టీచ‌ర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, స‌చివాల‌య, రెవెన్యూ.. ఇలా అనే సంఘాల ఉద్యోగ నేత‌లు జ‌గ‌న్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. పీఆర్సీని ప‌ది రోజుల్లో ప్ర‌క‌టిస్తాన‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు మ‌రో ఉద్యోగ నేత చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మైండ్ గేమ్ మొద‌లు పెట్టాడు.
వాస్త‌వంగా కోవిడ్ 19 అల్ల‌క‌ల్లోలం చేసిన 2019 మార్చి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స్కూల్స్ ను ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ దాదాపు రెండేళ్ల పాటు ఇంటిలో కూర్చొబెట్టి ల‌క్ష‌ల జీతాల‌ను టీచ‌ర్ల‌కు ఇచ్చింది. ఏ ఒక్క‌రూ ద‌యాదాక్షిణ్యంగానీ, క‌నిక‌రంగానీ సామాన్యుల‌పై చూప‌కుండా తీసుకున్నారు. ప‌నిచేయ‌కుండా ఫుల్ శాల‌రీ తీసుకోవడానికి ఏ మాత్రం సంకోచించ‌లేదు.ఇక ఆర్టీసీని ప్ర‌భుత్వం విలీనం చేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల మాదిరిగా టంఛ‌నుగా జీతాలు తీసుకున్నారు. రెండేళ్ల పాటు రోడ్ల‌పై బ‌స్సులు తిర‌గ‌లేదు. డ్యూటీలు లేవు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం క‌ట్ చేయ‌కుండా జ‌గ‌న్ జీతాల‌ను ఇచ్చాడు.
స‌చివాల‌య ఉద్యోగుల సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌టి నుంచి ఉచిత సౌక‌ర్యాలు, అద‌న‌పు బెనిఫిట్స్ ను పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వ‌చ్చి విధులు నిర్వ‌హించినందుకు ఉచిత భోజ‌నాల‌ను సైతం ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల అవినీతి జ‌గ‌ద్వితం. ఎక్క‌డో ఒక్క‌డైనా అవినీతికి పాల్ప‌డ‌కుండా ఉంటాడా.? అని జ‌ల్లెడ ప‌ట్టినా..దొర‌క‌రేమో. ఇలాంటి వాళ్ల డిమాండ్ల‌కు గ‌త‌ ప్ర‌భుత్వాలు తలొగ్గి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఛిన్నాభిన్నం చేశాయి. ఇప్ప‌టికే 6ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పులున్న ఏపీ ప్ర‌భుత్వాన్ని నిండి ముంచిన వాళ్ల‌లో ఉద్యోగ సంఘం నేత‌ల పాత్ర కీల‌కం.
పీఆర్సీ అంటే…జీతాల‌ను పెంచడ‌మే కాదు..త‌గ్గించ‌డం కూడా ఉంది. పలు సామాజిక అంశాల‌ను తీసుకుని పీఆర్సీని మ‌దిస్తారు. పెరిగిన ధ‌ర‌ల‌తో పాటు సామాన్యుల ఆదాయాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని లెక్కించాలి. కానీ, ఉద్యోగులు ఎప్పుడూ ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను మాత్ర‌మే ఇండెక్స్ గా చూపిస్తారు. మాన‌వాభివృద్ధి సూచిక కు అనుగుణంగా పీఆర్సీ ఉండాలి. కానీ, ఏనాడూ ఆ అంశాన్ని కొల‌మానంగా తీసుకోలేదు.
ప్ర‌భుత్వాలను న‌డిపే పార్టీలు ఓట్ల వేట‌లో ఉద్యోగుల అడుగుల‌కు మడుగులొత్తున్నారు. మిగిలిన వాళ్ల మాదిరిగా జ‌గ‌న్ కూడా సంఘాల నేతల మాయ‌లో ప‌డి ప్ర‌జ‌ల‌పై భారం వేయ‌డానికి స‌న్న‌ద్ధం అవుతారా? లేక ఉద్యోగుల వాల‌కానికి చెక్ పెడ‌తారా? అనేది సామాజిక స‌వాల్‌. ఇప్పుడు నెల జీతాలు ప్ర‌భుత్వం ఇవ్వ‌లేద‌ని చెబుతోన్న ఉద్యోగులు…71 డిమాండ్ల‌ను పెట్ట‌డం విచిత్రంగా ఉంది.