Firefly: డైనోసార్ల టైం కు చెందిన భారీ తుమ్మెద.. వాల్ మార్ట్ స్టోర్ లో గుర్తింపు

అది వేల ఏళ్ల కిందటి జురాసిక్ డైనోసార్ల కాలానికి చెందిన అరుదైన కీటకం. దీన్ని యునైటెడ్ స్టేట్స్‌లోని అర్కాన్సాస్‌లో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్ లో గుర్తించామని

అది వేల ఏళ్ల కిందటి జురాసిక్ డైనోసార్ల కాలానికి చెందిన అరుదైన కీటకం. దీన్ని యునైటెడ్ స్టేట్స్‌లోని అర్కాన్సాస్‌లో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్ లో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కీటకం పాలిస్టోచోట్స్ పంక్టాటా జాతికి చెందినదని గుర్తించబడింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ యొక్క కీటక గుర్తింపు ల్యాబ్ డైరెక్టర్ మైఖేల్ స్క్వర్లా 2012లో ఆర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో కీటక శాస్త్రంలో డాక్టరల్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ తుమ్మెదను (Firefly) గుర్తించారు. ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటూ మైఖేల్ స్క్వర్లా ఇలా అన్నారు..”నాకు స్పష్టంగా గుర్తుంది, ఎందుకంటే నేను పాలు తీసుకోవడానికి వాల్‌మార్ట్‌లోకి నడుస్తున్నాను మరియు భవనం వైపు ఈ భారీ తుమ్మెదను (Firefly) చూశాను.ఇది చాలా డిఫరెంట్ గా ఉందని అనుకున్నాను. వెంటనే నేను దానిని పట్టాను. నా వేళ్ల మధ్య దానిని పట్టుకొని మిగిలిన షాపింగ్ చేశాను. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాను. దానిని ఇంట్లో అమర్చాను. దాదాపు ఒక దశాబ్దం పాటు దాని గురించి మర్చిపోయాను. 2020 చివరలో నా ఆన్‌లైన్ కోర్సులో ఈ కీటకాన్ని ప్రదర్శించాను. సరిగ్గా ఆ సమయంలోనే ఆ తుమ్మెద (Firefly) డైనోసార్ల కాలం నాటిదని గుర్తించాను” అని మైఖేల్ స్క్వర్లా వివరించారు. దీనిపై పెన్ స్టేట్ యూనివర్శిటీ నుండి ఒక ప్రకటన వెలువడింది.

దీని చరిత్ర..

జెయింట్ లేస్‌వింగ్ లేదా పాలిస్టోకోట్స్ పంక్టాటా అనేది డైనోసార్ల కాలానికి చెందిన ఒక పెద్ద కీటకం. ఇది 1950 నుంచి తూర్పు ఉత్తర అమెరికాలో మాయమైంది. ఆర్కాన్సాస్‌లో ఈ జాతి తుమ్మెదను కనుగొనడం ఇదే మొదటిసారి.‘‘జురాసిక్ యుగం నాటి కీటకాలు ఇంకా ఎక్కడో మిగిలే ఉండి ఉండొచ్చు. వాటిని కనుగొనాల్సి ఉంది’’ అని శాస్త్రవేత్తలు అన్నారు.

ఆర్కాన్సాస్ వాల్‌మార్ట్‌ గురించి..

ఆర్కాన్సాస్ వాల్‌మార్ట్ బిల్డింగ్ ఓజార్క్ పర్వతాలలో ఉంది. ఈ ప్రాంతంపై ఎక్కువ అధ్యయనం జరగలేదని, కానీ ఇది జీవ వైవిధ్యా హాట్‌స్పాట్ కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఆకర్షణీయమైన, భారీ తుమ్మెదలు ఎవరికీ కంటబడకుండా ఉండటానికి ఈ ప్రదేశం అనువుగా ఉందని వారు అన్నారు.

Also Read:  Amoeba Attack: మెదడును తినే అమీబా ఎటాక్.. ఒక వ్యక్తి మృతి.. ఎందుకు? ఎలా?