World Sparrow Day : ప్రపంచ పిచ్చుకల అవార్డ్స్

ప్రపంచ వ్యాప్తంగా పిచ్చుకల దినోత్సవాన్ని మార్చ్ 20 వ తేదీన జరుపుతున్నారు.

  • Written By:
  • Publish Date - March 20, 2022 / 02:05 PM IST

ప్రపంచ వ్యాప్తంగా పిచ్చుకల దినోత్సవాన్ని మార్చ్ 20 వ తేదీన జరుపుతున్నారు. ఈ రోజు పిచ్చుకల అవార్డులు కూడా అందిస్తున్నారు. మానవుని సాంకేతికత వీటిని అంతం చేస్తోంది. ఇంధన కాలుష్యం వల్లా, గృహ నిర్మాణం లో అపార్ట్మెంట్లు సంస్కృతిలో వచ్చిన మార్పు వల్ల ముఖ్యంగా సెల్ టవర్ల నుండీ వచ్చే రేడీ యేషన్ వల్ల ఎక్కువ హాని జరుగుతోంది. సెల్ టవర్ల నుండీ వెలువడే అయస్కాంత తరంగాల వల్ల వాటి పురుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు. దీనిని ప్రపంచం గుర్తించి పిచ్చుకలను ప్రోత్సహించి, వాటికి ఆహారం అందించే వారికి ఏటేటా అవార్డులు అందిస్తున్నారు. ముఖ్యంగా పాత కాలంలో మన ఇళ్లళ్లో ఎక్కువ పూరి ఇళ్లు ఉండేవి. ఆ ఇంటి చూరుల్లో ఇవి గూళ్లు కట్టుకుని నివాసాలు ఏర్పరచుకునేవి. అక్కడే పిల్లలను కనేవి. వాటిని ఆహారం అందించి పెద్ద చేసి పంపించేవి . తల్లి ప్రేమను చాటే ఆ దృశ్యాలు ఎంతో కనువిందు చేసేవి. ఆ పిచ్చుల మద్య ఉండే అన్యోన్యత ఎంతో చూడ ముచ్చడగా ఉండి భార్యా భర్తల అనుబంధాన్ని గుర్తు చేసేవి . అలాగే ఊరి బైట చెట్ల అంచున అల్లిన గూళ్లను పిచ్చిక గూళ్లు అనే వాళ్లం. వాటిని ఎంతో అందంగా నిర్మించు కునేవి. ఈ పిచ్చుకల మీద భారత ప్రభుత్వం తపాళా బిళ్లను కూడా విడుదల చేసింది. ఈ పిచ్చుక కోసం రైతులు తమ పంటలోని వరి కంకులు, ఇతర పంటల కంకులను తెచ్చి ఇంటి ముందు వేలాడదీసే వారు. ప్రపంచ వ్యాప్తంగా జాతి పరంగా 35 రకాల పిచ్చుక జాతులు ఉన్నాయి. పాత తరం పిచ్చుకలు ఆఫ్రికా, ఆసియా, యూరోప్ లో ఎక్కువగా విస్తరించాయి . తరువాత ఆధునిక యుగంలో అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో విస్తరించి నగరాల్లో స్థిర పడ్డాయి. చిన్న కుర్ర వాడు ఉషారుగా ఉండి ఎగిరెగి పడుతుంటే ఎందుకురా! పిచ్చుకంత లేవు, ఎగిరెగిరి పడుతున్నావు అనే సామెత ఒకటి మనకుంది. ధాన్యం లో పై పొట్టుని వొలిచి గింజను మాత్రమే తింటాయి. పై పొట్టును కూడా అతి వేగంగా వొలుస్తాయి. అందుకు అనువుగా చిన్న ముక్కు, బలంగా ఉంటుంది. భార్యా, భర్తలుగా జీవిద్దామని నిర్ణయించుకున్న తరువాతే ఆ రెండూ కల్సి కష్ఠపడి కూడు కట్టుకుని గుడ్లు పెట్టి , పిల్లల్ని కని పెంచుతాయి. గోదుమ, ఊదా రంగులో ఉండే ఈ పిచ్చుకలు బలమైన నాలుక ఉండి , చిన్న తోకతో, చిన్న బలమైన ముక్కుతో ఉంటాయి. వీటి ఆహారం ఎక్కువగా గింజలు , తరువాత క్రిమి, కీటకాలు తింటాయి. అందుకే ఇళ్ల ముందు గుంపులుగా వాలి మనం రాగానే తుర్రున ఎగిరి పోతాయి. వీటి పొడవు 4.5 అంగుళాల నుండీ 7 అంగుళాల మద్యలో ఉంటుంది. సరదాగా మనం కూడా కృత్రిమ ఆవాసాలు ఏర్పటు చేసి , ఆహారం , నీరు అందిస్తే అవి వచ్చి నివాసాలు ఏర్పరచు కుంటాయి. ఒకసారి ప్రయత్నించి చూస్తారు కదూ !