Lemons: నిమ్మ ధరలు అమాంతం పెరగడానికి కారణం ఇదే..!!

గత కొన్ని వారాలుగా నిమ్మకాయ ధరలు అమాంతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఒక నిమ్మకాయ ధర రూ.

  • Written By:
  • Updated On - April 15, 2022 / 09:57 AM IST

గత కొన్ని వారాలుగా నిమ్మకాయ ధరలు అమాంతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఒక నిమ్మకాయ ధర రూ. 10నుంచి 15 మధ్య పలుకుతోంది. నెల రోజుల క్రితం రూ. 70 నుంచి 80రూపాయలకు కిలో లభించిన నిమ్మకాయల కోసం ఇప్పుడు దాదాపు మూడువందల నుంచి నాలుగు వందలు పెట్టాల్సి వస్తోంది. నిమ్మకాయల ధరలు దాదాపు ఆరు రెట్లు పెరిగాయి. అయితే నిమ్మకాయలు ఇంత భారీగా పెరగడానికి కారణం ఏంటి.? దేశంలో నిమ్మకాయలను ఎక్కువగా ఎక్కడ పండిస్తారు.? భారీగా ధరలు పెరగడానికి దారితీసిన కారణాలేంటి? తెలుసుకుందాం.

దేశంలో నిమ్మకాయలు ఎక్కడ పండిస్తారు.
దేశవ్యాప్తంగా కలిపి 3.17 లక్షల హెక్టార్లలో నిమ్మతోటలను సాగుచేస్తున్నారు. ఏడాదికి మూడుసార్లు పంట వస్తుంది. 45,000హెక్టార్లలో నిమ్మతోటలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోనూ నిమ్మకాయ తోటలను సాగుచేస్తారు. అయితే ఈ నిమ్మకాయలు రెండు రకాలుగా ఉంటాయి. లెమన్ అండ్ లైమ్. చిన్నగా గుండ్రగా ఉండే నిమ్మకాయలు కాగ్జీదేశంలో ఎక్కువగా పండించే రకం. ఉత్తరభారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లోపండించే నిమ్మకాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పశ్చిమ బెంగాల్లోని గోందోరాజ్ వంటి రకాలు స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందినవి.

ఈ నిమ్మసాగుకు పొడి, తేమతో కూడిన వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధికవర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నిమ్మసాగుకు అనుకూలం కాదు. ఎందుకంటే అధిక వర్షాపాతం అనేది బ్యాక్టీరియాను ప్రేరేపిస్తుంది. రైతులు సాధారణంగా ఒక ఎకరంలో 210 నుంచి 250 నిమ్మ చెట్లను నాటుతారు. ఈ చెట్లు నాటిన మూడు సంవత్సరాల తర్వాత మొదటి పంట వస్తుంది. ఒక చెట్టుకు సగటున 1,000నుంచి 1500 కాయలు వస్తాయి.

బుధవారం కొన్ని నగరాల్లో నిమ్మకాయల ధరలు..
బహార్ ట్రీట్ మెంట్ తో పుష్పించేలా చేసి…ఏడాది పొడవున రైతులు పండ్లను సరఫరా చేస్తారని CCRI శాస్త్రవేత్త డాక్టర్ AA ముర్కుటే తెలిపారు. ఈ చికిత్స విధానం ద్వారా రైతులు నీటిని తగ్గించి…రసాయనాలు పిచికారీ చేస్తారు. తోటలను కత్తిరించడం, ఎరువులు చల్లిన తర్వాత చెట్లకు నీరు పెడతారు. ఏడాదికి మూడు సార్లు పంటలు చేతికి వస్తాయి. ఈ పంటలను అంబే, మృగ్, హస్త అని పిలుస్తారు. సీజన్ ఆధారంగా వాటికి పేరు పెడతారు. అంబే బహార్ జనవరి-ఫిబ్రవరిలో పుష్పించడం ప్రారంభిస్తుంది. ఏప్రిల్ లో పంట చేతికి వస్తుంది. మృగ్ బహార్ సమయం అంటే జూన్ -జూలైలో పూత వస్తుంది.. అక్టోబర్ లో క్రాప్ చేతికి వస్తుంది. హస్త బహార్ లో అంటే సెప్టెంబర్ -అక్టోబర్ మధ్యలో పూత వచ్చి…మార్చి తర్వాత చేతికి వస్తాయి. ఈ విధంగా రైతులు ఏడాది పొడవునా నిమ్మకాయలు మార్కెట్లకు తరలిస్తారు.

మార్కెట్ కు అందించే పంటలో దాదాపు 60శాతం అంబే బహార్ నుంచే వస్తుంది. మిగిలిని 30 శాతం హస్త, మృగ్ బహార్ నుంచి వస్తుందని ముర్కుటే చెప్పారు. మృగ్ బహార్ పండ్లు ఎక్కువ శాతం కోల్డో స్టోరేజీలకు పంపిస్తారు. మిగిలిని రెండు రకాలను రిటైల్ మార్కెట్లోకి సరఫరా చేస్తారు.

ధరలు ఎందుకు పెరిగాయి..?
దేశవ్యాప్తంగా గతేడాది రుతుపవనాలు బాగానే ఉన్పప్పటికీ…సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీగా వర్షాలు కురిశాయి. నిమ్మతోటలకు అధిక తేమ ఉండకూడదు. అధిక వర్షాపాతం కారణంగా నిమ్మతోటలు పుష్పించలేదు. పంట గణనీయంగా తగ్గింది. రైతులు నిల్వ చేసుకునేంత దిగుబడి రాలేదు. అంబే బహార్ జాతికి చెందిన నిమ్మతోటలు కూడా అకాల వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయాయి. ఫిబ్రవరి నెల చివరి నుంచి పెరిగిన ఉష్ణోగ్రతలు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. సాధారణంగా వేసవిలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దిగుబడి గణనీయంగా తగ్గడంతో రేట్లు అమాంతం పెరిగాయి.

ధరలు ఎప్పుడు తగ్గనున్నాయి.?
ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే అక్టోబర్ లో పంట మార్కెట్లకు వస్తుంది. అక్టోబర్ తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినలేవు. ఆ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నా…డిమాండ్ తగ్గదని భావిస్తున్నారు.