Site icon HashtagU Telugu

WhatsApp : వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లను ఇక స్క్రీన్ షాట్ తీయలేరు

Whatsapp Profile Pictures

Whatsapp Profile Pictures

WhatsApp : వాట్సాప్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ రాబోతోంది. ఇకపై మన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌ను ఎవరూ స్క్రీన్ షాట్ కూడా తీయలేరు. ఈ ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ బ్లాకింగ్‌కు సంబంధించిన వివరాలను మెటా ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. వాట్సాప్ బీటా వర్షన్‌లో ఉన్న యూజర్ల ప్రొఫైల్ పిక్చర్లను ఇప్పటికే స్క్రీన్ షాట్ తీయడం కుదరడం లేదు. అందరిలా సాధారణ వాట్సాప్ వర్షన్లు వాడే వాళ్లు మాత్రమే ఇతరుల స్క్రీన్ షాట్లు ప్రస్తుతానికి తీయ గలుగుతున్నారు. త్వరలో ఆ ఛాన్స్ మనందరికి కూడా ఉండబోదు. ఇతరుల ప్రొఫైల్ పిక్చర్లు దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ఈవిధమైన ప్రైవసీ సేఫ్టీ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెడుతోంది.

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి వాట్సాప్(WhatsApp) ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ తీయడానికి మరెన్నో ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉన్నాయి. ప్రైవసీ ఫీచర్ వల్ల ప్రొఫైల్ పిక్చర్‌ను ఇక  స్క్రీన్ షాట్ తీయడానికి వీలు పడకపోవచ్చు. ఒకవేళ ఆ ప్రొఫైల్ ఫొటోను సేవ్ చేసుకోవాలి అనుకుంటే.. మరో ఫోన్ నుంచి ఆ ప్రొఫైల్ ఫొటోని నేరుగా ఫొటో తీసే అవకాశం ఉంటుంది. మెయిన్ చాట్ లిస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి అందులో నుంచి యూజర్ ప్రొఫైల్ ఫొటోను క్యాప్చర్ చేసే రిస్క్ ఉంటుందది.

Also Read : Ugadi 2024 : ఉగాది రోజున ఆ మూడు రాశుల వారికి మహర్దశ

మల్టీపుల్ ఛాట్‌లను పిన్ చేసే ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇది కూడా టెస్టింగ్‌లో ఉంది. దీని ద్వారా మనం పర్సనల్, గ్రూప్ ఛాట్లను పిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కేవలం ఒక్క ఛాట్‌ను మాత్రమే పిన్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. త్వరలో రానున్న అప్‌డేట్ ద్వారా మూడు ఛాట్ల వరకు పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.6.15లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఐవోఎస్, ఆండ్రాయిడ్ రెండింటికీ ఈ ఫీచర్‌ను మెటా అందించే అవకాశం ఉంది.

Also Read : Pallavi Prashanth: ప్రాణం పోయిన కూడా ఇచ్చిన మాట తప్పను : పల్లవి ప్రశాంత్