Ugadi 2024 : ఉగాది పండుగ ఏప్రిల్ 09న రాబోతోంది. ఉగాది(Ugadi 2024) నుంచి ప్రారంభయ్యేది శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈసారి ఉగాది విశేషం ఏమిటంటే.. దాదాపు 30 ఏళ్ల తర్వాత పండుగ రోజున అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శష్ రాజయోగం ఏర్పడుతున్నాయి. వీటివల్ల మూడు రాశులవారు లాభపడుతారని పండితులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
వృషభ రాశి
వృషభ రాశివారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కలిసొస్తుంది. స్థిరాస్తులు కొంటారు. ఉన్నత పదవులు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ప్రారంభించిన కార్యాలు సక్సెస్ అవుతాయి. శని శుభస్థానంలో, గురుడు సంవత్సరం మొత్తం జన్మంలో ఉండడంతో వల్ల ఈ రాశి వారికి అనుకూల సమయం కంటిన్యూ అవుతుంది. అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వాహన ప్రమాదాల గండం ఉంది.
- వృషభ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పవు. ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఉద్యోగులు పని ప్రదేశం మారే సూచనలున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. విదేశాలలో ఉద్యోగాలు చేయాలి అనుకున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి.
Also Read : Lottery King No 1 : రూ.1,368 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్న ‘లాటరీ కింగ్’ ఎవరు ?
- వృషభ రాశి వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు నష్టపోకతప్పదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూల సమయం.
- వృషభ రాశి రాజకీయ నాయకులకు క్రోధి నామ సంవత్సరం అనుకూలమైన టైం. ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఉన్నత పదవులు లభిస్తాయి. చుట్టూ ఉండేవారే అన్యాయం చేసే రిస్క్ ఉంది.
- వృషభ రాశిలోని అవివాహిత మహిళలకు వివాహం జరుగుతుంది. గర్భిణులకు సమస్యలు ఉండవు. ఉద్యోగం చేసే స్త్రీలకు కొన్ని సమస్యలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది.
Also Read :Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో
మకరరాశి
మకర రాశి వారు కొత్త ఏడాదిలో ఎన్నో ప్రయోజనాలు పొందబోతున్నారు. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు.
మేషరాశి
హిందూ నూతన సంవత్సరం మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు మీపై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది.