Site icon HashtagU Telugu

Matsya 6000 : సముద్రయాన్ కోసం ‘మత్స్య 6000’ రెడీ.. విశేషాలివీ ?

Matsya 6000

Matsya 6000 : ఓ వైపు ‘చంద్రయాన్ -3’.. మరోవైపు సూర్యయాన్ ‘ఆదిత్య ఎల్-1’.. ఇంకోవైపు ‘గగన్ యాన్’ పై ఫోకస్ పెట్టిన భారత్ ఇప్పుడు ‘సముద్రయాన్’ కోసం కూడా ఒక అస్త్రాన్ని రెడీ చేస్తోంది.  ఇంతకీ సముద్రయాన్ మిషన్ ఏమిటి అని అనుకుంటున్నారా ?  సముద్ర లోతుల్లో దాగి ఉన్న సీక్రెట్స్ ను కనుక్కోవడమే  సముద్రయాన్ మిషన్ లక్ష్యం. దీనికి సంబంధించిన తొలి ట్రయల్‌ త్వరలోనే జరగనుంది. ఈ మిషన్ లో భాగంగా  సముద్రపు లోతుల్లోకి పంపడానికి ‘మత్స్య 6000’ పేరుతో ఒక సబ్ మెర్సిబుల్ ను భారత్ రెడీ చేసింది. చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రెండేళ్ల వ్యవధిలో దీన్ని తయారు చేశారు. ఇది ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. అంతరిక్ష యాత్రికులను ఆస్ట్రోనాట్స్ అంటారు. సముద్ర యాత్రికులను ఆక్వానాట్స్ అంటారు. మత్స్య 6000లో ముగ్గురు ఆక్వానాట్స్ కూర్చొని సముద్రంలో 6 కిలోమీటర్ల (6000 మీటర్లు) లోతులోకి వెళ్లి రావచ్చు. ఇందులో ఉన్న అద్దాల కిటికీల నుంచి సముద్రంలో ఉన్న జలచరాలు, మొక్కలను క్రిస్టల్ క్లియర్ గా చూడొచ్చు.  దీనిలోపల ఆక్సిజన్ వసతి కూడా ఉంటుంది. వచ్చే ఏడాది (2024) మార్చికల్లా మత్స్య 6000తో మొదటి ట్రయల్ నిర్వహించనున్నారు. తొలివిడత ప్రయోగాత్మకంగా తమిళనాడు తీరంలోని బంగాళాఖాతం సముద్రంలోకి దీన్ని 500 మీటర్ల లోతుకు పంపనున్నారు.

Also read : Benefits Of Magnesium: మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆహారాలు ఇవే.. శ‌రీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జ‌రుగుతుందంటే..?

సముద్రయాన్ మిషన్ లక్ష్యం ఏమిటి?

సముద్ర గర్భంలో ఉన్న నికెల్, కోబాల్ట్, మాంగనీస్, హైడ్రోథర్మల్ సల్ఫైడ్, గ్యాస్ హైడ్రేట్ల అన్వేషణే సముద్రయాన్ మిషన్ ప్రాథమిక లక్ష్యం. దీంతోపాటు సముద్రంలో హైడ్రోథర్మల్ వెంట్స్, తక్కువ ఉష్ణోగ్రత మీథేన్ సీప్‌లలో కెమోసింథటిక్ బయోడైవర్సిటీని ఈ మిషన్ ద్వారా స్టడీ చేసే ప్రయత్నం చేస్తారు. 2026 నాటికి.. మత్స్య 6000 ద్వారా ముగ్గురు అక్వానాట్స్ ను సముద్రంలో 6000 మీటర్ల లోతుకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సముద్రపు లోతుల్లో లిథియం, కాపర్, నికెల్‌, కోబాల్ట్, మాంగనీస్  లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సముద్రంలో ఆ నిక్షేపాలు ఉన్నట్లు తేలితే.. అది పెద్ద విజయమే అవుతుంది. లిథియం, కాపర్, నికెల్‌ లను బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో కోబాల్ట్ కీలకం. ఉక్కు పరిశ్రమలో మాంగనీస్ వినియోగం చాలా ఎక్కువ. ఇన్ని కీలకమైన రంగాల అవసరాలను తీర్చే వనరులకు నెలవుగా సముద్ర గర్భం ఉన్నప్పుడు.. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమే ఇప్పుడు సముద్రయాన్ మిషన్ నిర్వహిస్తోంది.

Also read : India Will Beat China: చైనాకు తగిన సమాధానం ఇవ్వనున్న భారత్.. సరిహద్దుల్లో కొత్త రోడ్లు, వంతెనలు, సొరంగాలు..!

‘మత్స్య 6000’ ఫీచర్స్ అదుర్స్..