Flight Journey For Food : విమాన ప్రయాణం.. ఇది సామాన్యుడి లైఫ్ టైం ట్రీమ్..
కానీ ఒక యువతి నిత్యం మినీ విమానంలో జర్నీ చేస్తుంటుంది..
ఏదో పెద్ద పని కోసమో.. ఎమర్జెన్సీ అవసరాల కోసమో.. ఆమె ఫ్లైట్ జర్నీ చేయడం లేదు..
తన ఊరికి దగ్గర్లో ఉన్న గోడౌన్ కు చేరుకున్న ఫుడ్ డెలివరీ పార్సిల్స్ ను ఇంటికి తెచ్చుకోవడానికి ఆమె నిత్యం విమానంలో వెళ్తుంటుంది..
మినీ విమానాన్ని స్వయంగా నడుపుతూ దాదాపు 300 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంటుంది.
ఇంతకీ ఆమె ఎవరు ? ఎందుకు ఈ జర్నీ ?
Also read :BRO : ‘బ్రో’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందంటే..
ఆమె పేరు సెలీనా ఆల్స్‌వర్త్ (Salina Alsworth). వయసు 25 ఏళ్ళు. అమెరికాలోని అలాస్కాలో ఉన్న పోర్ట్ ఆల్స్‌వర్త్ (Port Alsworth) గ్రామస్తురాలు సెలీనా. పోర్ట్ ఆల్స్‌వర్త్ అనేది పర్వతాలపై ఉన్న మారుమూల ప్రాంతం. అక్కడ దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు మొదలైన సౌకర్యాలు లేవు. ఈ గ్రామ జనాభా 186 మాత్రమే. పర్యాటకులు వచ్చినప్పుడు మాత్రమే గ్రామంలో ఉండేవారి సంఖ్య 400 దాకా పెరుగుతుంది. సెలీనా కుటుంబం 1940వ దశకం నుంచే పోర్ట్ ఆల్స్‌వర్త్ లో నివసిస్తోంది. ఈ ఊరికి రోడ్డు అనేది లేదు. దీంతో పోర్ట్ ఆల్స్‌వర్త్ కు ఎవరైనా వెళ్లాలన్నా .. పోర్ట్ ఆల్స్‌వర్త్ నుంచి బయటికి ఎవరైనా రావాలన్నా మినీ విమానాలే దిక్కు. ఈ ఊరికి దగ్గర్లో కెనాయ్ (Kenai), యాంకరేజ్ (Anchorage) టౌన్ లు ఉన్నాయి. పోర్ట్ ఆల్స్‌వర్త్ కు రాకపోకలు సాగించాలంటే.. కెనాయ్, యాంకరేజ్ టౌన్ లే ల్యాండింగ్ పాయింట్స్. పోర్ట్ ఆల్స్‌వర్త్ గ్రామస్తులు ఫుడ్ ప్రోడక్ట్స్ ను తెచ్చుకునేందుకు నిత్యం మినీ విమానంలో కెనాయ్, యాంకరేజ్ టౌన్ లకు(Flight Journey For Food) వెళ్లి వస్తుంటారు.

భర్తతో కలిసి మినీ విమానంలో..
సెలీనా ఆల్స్‌వర్త్ కుటుంబం గత ఐదు తరాలుగా (1940 నుంచి) పోర్ట్ ఆల్స్‌వర్త్ లో లేక్ క్లార్క్ రిసార్ట్‌ను నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం పోర్ట్ ఆల్స్‌వర్త్ కు వచ్చే వందలాది మంది ఈ రిసార్ట్ లోనే ఆతిథ్యం పొందుతుంటారు. ఈక్రమంలోనే రిసార్ట్ కు అవసరమయ్యే ఆహార పదార్థాలు, ఫుడ్ మెటీరియల్, ప్యాకేజింగ్ మెటీరియల్ ను తెచ్చుకునేందుకు ఊరికి సమీపంలోని యాంకరేజ్ టౌన్ కు సెలీనా ఆల్స్‌వర్త్ తన భర్త జేర్డ్ రిచర్డ్‌సన్ తో కలిసి మినీ విమానంలో వెళ్తుంటుంది.
Also read : Hyderabad Rains: డల్లాస్, ఇస్తాంబుల్ మాటలు ఏమయ్యాయి కేసీఆర్, కేటీఆర్
ఫిషింగ్ గైడ్ తో సెలీనా పెళ్లి ఇలా జరిగింది..
జేర్డ్ రిచర్డ్‌సన్ ఒక ఫిషింగ్ గైడ్ గా కొందరు టూరిస్టులతో కలిసి పోర్ట్ ఆల్స్‌వర్త్ కు వచ్చాడు. లేక్ క్లార్క్ రిసార్ట్‌ను నడుపుతున్న సెలీనా ఆల్స్‌వర్త్ తో అతడు ప్రేమలో పడ్డాడు. చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తన భార్యతో కలిసి అతడు రిసార్ట్ నడుపుతూ హాయిగా పోర్ట్ ఆల్స్‌వర్త్ లోనే ఉంటున్నాడు.