Site icon HashtagU Telugu

UKs First Lady : ఇదీ సింప్లిసిటీ.. ఫ్యామిలీతో బ్రిటన్ ప్రథమ మహిళ

Uks First Lady

Uks First Lady

UKs First Lady : కొంతమంది ధనం చూసుకొని మురిసిపోతుంటారు. వ్యాపారాలు చూసుకొని గర్వానికి సరెండర్ అయిపోతుంటారు.  కానీ బ్రిటన్ ప్రథమ మహిళ అక్షతామూర్తి (ప్రధాని రిషి సునాక్ భార్య)  తన  పేరెంట్స్  ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధామూర్తిలతో కలిసి చాలా సింపుల్‌గా బెంగళూరులో చక్కర్లు కొట్టారు. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. వారి వెంట అక్షతా మూర్తి (UKs First Lady) కుమార్తెలు అనౌష్క, కృష్ణ కూడా ఉన్నారు. బెంగళూరు నగరంలోని రాఘవేంద్ర మఠంలో పుస్తకాలను చెక్ చేస్తూ వీరంతా కనిపించారు. ఆ టైంలో వారి వద్ద ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు. సాధారణ దుస్తుల్లో మఠం వద్ద కుటుంబ సభ్యులతో వారు గడపడం విశేషం. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

We’re now on WhatsApp. Click to Join

అక్షతా మూర్తి పేరెంట్స్‌తో కలిసి ఉన్న వీడియోను ఓ వ్యక్తి షేర్ చేస్తూ.. ‘‘యూకే ప్రధాని రిషి సునాక్ భార్య, పిల్లలు బెంగళూరులోని రాఘవేంద్ర మఠం వద్ద కనిపించారు. ఎటువంటి సెక్యురిటీ లేకుండా ఉన్నారు. ఇది వారి సింప్లిసిటీకి నిదర్శనం’’ అని రాసుకొచ్చాడు.  అయితే ఈ వీడియో ఎప్పటిది ? అనేది తెలియాల్సి ఉంది.  ఆస్తులు, అంతస్తులు ఉన్నా.. పెద్దపెద్ద హోదాలు ఉన్నా.. సాదాసీదా వ్యక్తుల్లా మసులుకోవడం ఇలాంటి కొందరికే సాధ్యమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వారిని చూసి చాలా నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Also Read : Telangana Fossils : డైనోసార్ల యుగపు మొక్కలు.. 6.5 కోట్ల ఏళ్ల నాటి శిలాజాలు లభ్యం

ఈ నెల మొదట్లోనూ అక్షతా మూర్తి తన తండ్రి నారాయణమూర్తితో కలిసి బెంగళూరులోని ఓ బేకరీలో ఐస్ క్రీం తింటూ కనిపించారు. ఆ ఫొటో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రచయిత చిత్ర బెనర్జీ దివాకరుణికి చెందిన ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల బెంగళూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో నిర్వహించారు. దీనికి  అక్షతా మూర్తి హాజరయ్యారు.

Also Read : TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటిస్థలాలతోపాటు మరిన్ని వరాలు

యూకే ప్రస్తుత ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్‌ను అక్షతా మూర్తి 2009లో పెళ్లి చేసుకున్నారు. పీఎంగా సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరూ మొదటి సారిగా గతేడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సు నిమిత్తం భారత్‌కు వచ్చారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని కూడా సందర్శించి ప్రార్థనలు చేశారు.

Also Read : RBI Penalty: మ‌రో మూడు బ్యాంకుల‌కు షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ.. భారీగా జ‌రిమానా..!