Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్స్ : అధికారులకు సీఎం ఆదేశాలు

Transgenders for traffic control: CM orders to officials

Transgenders for traffic control: CM orders to officials

Transgenders to traffic control : తెలంగాణ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్స్ ను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హోమ్ గార్డు తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Read Also: Juice on Empty Stomach : ఖాళీ కడుపుతో జ్యూస్ ఎందుకు తాగకూడదంటే..!

ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, పారిశుధ్యం, ఇతర పనుల్లో పురోగతి పై సీఎం అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని.. ఎట్టి పరిస్థితుల్లో గడువు లోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్టు 15 రోజుల్లో అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తప్పుడు రిపోర్టులు ఇస్తే.. అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రివ్యూకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

Read Also: Bypolls in Telangana: ఉప ఎన్నికలు వచ్చినా హస్తందే విజయం: టీ-పీసీసీ