Naga Panchami 2023: ఇవాళ (ఆగస్టు 21) నాగ పంచమి.
ఈ రోజు నాగదేవతను పూజిస్తారు.
కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్ల గోడలపై పాముల బొమ్మలు గీసి పూజలు చేస్తారు.
మరికొన్ని చోట్ల సమీపంలోని నాగ సన్నిధానాన్ని సందర్శించి నాగులను పూజిస్తారు.
ఈ రోజు నాగదేవతతో పాటు శివుడిని పూజించడం వల్ల జాతకంలోని కాలసర్ప దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
ఈ రోజున ఆదిశేష, అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, అశ్వథర, తక్షక, దృతరాష్ట్ర, శంఖపాల, కులీర, కర్కోటక, కళింగ, పింగళ అనే నాగులను పూజించే ఆచారం ఉంది.
ఈ సర్పాలను పూజించడం వల్ల రాహు-కేతువుల ప్రభావంతో తలెత్తే అశుభాలు తొలగిపోతాయి.
Also read : Today Horoscope : ఆగస్టు 21 సోమవారం రాశి ఫలితాలు.. వారి ప్రయత్నాలు ఫలిస్తాయి
నాగ పంచమి పూజా విధానం ఇదీ..
- గోడకు కుంకుమ పూసి పూజా స్థలాన్ని సిద్ధం చేయండి.
- మీ ఇంటి తలుపు వద్ద నాగదేవత చిత్రాన్ని ఉంచండి.
- పూజా స్థలంలో చెక్క పీఠాన్ని ఉంచి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరవాలి.ఈ పీఠంపై మట్టితో చేసిన సర్పం విగ్రహం, ఫోటో లేదా సర్పం చిత్రాన్ని గీయండి.
- ఇంటిలోని దేవుని గదిలో పేడతో 8 పాము ఆకారాలు చేసి పూజించాలి.
- జలాభిషేకం తర్వాత దానికి పూలు, పసుపు, కుంకుమ, అక్షతలు, నెయ్యి, చందనం సమర్పించండి.
- పచ్చి పాలు, నెయ్యి, పంచదార కలిపి నాగమూర్తికి సమర్పించండి.
- ఇంట్లో పాయసం చేసి బ్రాహ్మణులను ఇంటికి పిలిచి వారికి ఇవ్వాలి. బ్రాహ్మణులకు తినిపించే ముందు నాగదేవత ప్రతిమకు పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి.
- ఈ వ్రతం చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ పాయసాన్ని ప్రసాదంగా తీసుకోవాలి.
Also read : Neck Pain : మెడ నొప్పి వస్తుందా.. తగ్గడానికి ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
నాగ పంచమి (Naga Panchami 2023) తిథి
తిథి ప్రారంభం : ఆగస్టు 20 (ఆదివారం) మధ్యాహ్నం 12:21 నుంచి
తిథి ముగింపు : ఆగస్టు 21 (సోమవారం) మధ్యాహ్నం 2:00 గంటల వరకు
Also read :Gods Idol: దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలను బహుమతిగా ఇవ్వవచ్చా.. ఇవ్వకూడదా?
నేడే గరుడ పంచమి
ఈరోజే (ఆగస్టు 21) గరుడ పంచమి కూడా జరుపుకుంటారు. శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో ” గరుడ పంచమి” ఒకటి. ఈ రోజున మహిళలు ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయసం నైవేద్యం పెడతారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమగల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది. గరుత్మంతుడు అంటే శ్రీ మహావిష్ణువు వాహనం. సూర్యుడి రధసారధి అయిన అనూరుడికి తమ్ముడే గరుత్మంతుడు. సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది. కశ్యపుడు , వినతల కుమారుడే గరుడుడు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.