Site icon HashtagU Telugu

Honey – Heart : తేనెతో గుండెకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

Honey Heart

Honey – Heart : తేనెను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  ప్రత్యేకించి ఎంతో కీలకమైన మన గుండెకు మేలును చేకూర్చే చాలా ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి. అయితే తేనెను నేరుగా వాడితే మన గుండెకు ఆ ప్రయోజనం లభించదు. తేనె, దాల్చిన చెక్క పౌడరు కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఓట్​మీల్, టీ, బేకరీ ఫుడ్స్‌లో వాడినా రుచికరంగానే ఉంటుంది.  తేనె, దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే రిస్కు తగ్గుతుంది. దీనివల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులు(Honey – Heart) తగ్గుతాయి. సడెన్‌గా హార్ట్ స్ట్రోక్​ వచ్చే ముప్పు తొలగుతుంది. చాలా శాస్త్రీయ అధ్యయనాల్లో ఈవివరాలు వెల్లడయ్యాయి. తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. దానిని మితంగా తీసుకోవాలి. రోజుకు ఓ స్పూన్ తేనె తీసుకుంటే సరిపోతుంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Life Expectancy : చిన్న చేపలను ముళ్లతో సహా తింటే.. ఆయుష్షు అప్!

అంగస్తంభన, స్పెర్మ్ హెల్త్ కోసం..

అంగస్తంభనను తగ్గించుకోవాలని భావిస్తే తేనె వాడాలి. పాలల్లో తేనె కలిపి తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. టెస్టోస్టిరాన్​ను గణనీయంగా పెంచి.. సంతానోత్పత్తి సమస్యలను తేనె దూరం చేస్తుంది. మహిళల యోని, గర్భాశయ సమస్యలను తేనె దూరం చేస్తుంది. స్త్రీల అండాశయంలో ఏర్పడే ఎగ్ క్వాలిటీని తేనె పెంచుతుంది.

Also Read : Shahrukhs House : బాలీవుడ్ బాద్‌షా ఇంట్లో ఉండే ఛాన్స్ .. రెంట్ ఎంతో తెలుసా ?