Site icon HashtagU Telugu

Submersible Vs Submarine : సబ్‌ మెర్సిబుల్, సబ్ మెరైన్ మధ్య తేడాలు ఇవీ

Submersible Vs Submarine

Submersible Vs Submarine

Submersible Vs Submarine : టైటానిక్ ఓడ శకలాలను చూసేందుకు టూరిస్టులను తీసుకెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్  పేలిపోయిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనలో అందులోని ఐదుగురు టూరిస్టులు చనిపోయారు.

ఈ వార్తల నేపథ్యంలో చాలామంది  సబ్‌మెర్సిబుల్ , సబ్ మెరైన్ (జలాంతర్గామి) ఒక్కటే అని భావిస్తున్నారు.

ఈ రెండింటిని పర్యాయ పదాలుగా వాడుతున్నారు.

వాస్తవానికి ఇవి రెండూ పూర్తిగా డిఫరెంట్. 

సబ్‌మెర్సిబుల్స్‌లో తక్కువ మంది మాత్రమే ప్రయాణించగలరు. దీని లోపల కూడా  పైలట్ ఉంటాడు. అయితే సముద్ర ఉపరితలంపై ఉన్న ఓడ (మదర్ షిప్) నుంచి దీని రిమోట్ గా ఆపరేట్  చేస్తారు. ఇది సాధారణంగా శాస్త్రీయ ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినది.  “ఒక జలాంతర్గామి ఓడరేవును విడిచిపెట్టిన తర్వాత.. దాని స్వంత శక్తితో ఓడరేవుకు తిరిగి రాగలదు.కానీ  సబ్‌మెర్సిబుల్‌కి చాలా పరిమితమైన పవర్ రిజర్వ్‌లు ఉంటాయి. కాబట్టి దానికి మదర్ షిప్ నుంచి సపోర్ట్, గైడెన్స్  అవసరం. మదర్ షిప్ నుంచి రిమోట్ గా సబ్‌మెర్సిబుల్ ను ఆపరేట్ చేస్తారు. సబ్ మెరైన్ లను సాధారణంగా సైనిక అవసరాలకే  వినియోగిస్తారు.

Also read : Titan Submersible Found : టైటాన్ సబ్ మెర్సిబుల్ ఆచూకీ దొరికింది.. శకలాలను గుర్తించిన అండర్‌వాటర్ రోబో

సబ్ మెరైన్ లలో ఆక్సిజన్ అన్ లిమిటెడ్  ఎలా ?

సబ్‌మెర్సిబుల్స్‌తో పోలిస్తే  సబ్ మెరైన్ లలో(Submersible Vs Submarine) ఎమర్జెన్సీ పరిస్థితులను, విపత్తులను ఎదుర్కొనేందుకు సరిపడా ఏర్పాట్లు, ఉపకరణాలు, పరికరాలు ఉంటాయి. సబ్ మెరైన్ లు గరిష్టంగా 10 రోజుల పాటు సముద్ర గర్భంలో ఉండగలవు.  కొన్ని అత్యాధునిక సబ్ మెరైన్ లు 14 రోజులు కూడా సముద్రం లోపల ఉండగలవు.  సబ్ మెరైన్ లలోని  సిబ్బందికి శ్వాస ఆడటానికి ఆక్సిజన్ అవసరం. ఇది  ఎలా లభిస్తుంది అంటే..  సముద్రపు నీటి నుంచి అని చెప్పాలి. సముద్రపు నీటి నుంచి అన్ లిమిటెడ్ గా ఆక్సిజన్‌ను తయారు చేసే ప్రత్యేక యంత్రాలు సబ్ మెరైన్ లోపల ఉంటాయి. అవి విద్యుత్ విశ్లేషణ అనే ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుంచి  ఆక్సిజన్ తయారు చేస్తాయి. ఇందులో భాగంగా విద్యుత్తును ఉపయోగించి సముద్రపు నీటిలోని H20 అణువులను విభజించి ఆక్సిజన్ ను సేకరిస్తుంది. తాజాగా అట్లాంటిక్ మహా సముద్ర గర్భంలో పేలిపోయిన అమెరికా కంపెనీ OceanGate కు చెందిన  టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో కేవలం 96 గంటలకు సరిపోయే ఆక్సిజన్ ఉంది.

Also read : Hair Care: పలుచని జుట్టుతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలను పాటించండి?

టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఎంత లోతుకు వెళ్లగలదు?

టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ గరిష్ట వేగం మూడు నాట్లు. అంటే సముద్రం లోపల 1 గంటకు 5.5 కిలోమీటర్ల దూరం జర్నీ చేయగలదు.  ఇది ప్రయాణికులను సముద్రంలో గరిష్టంగా  4,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లగలదు. తాజాగా రెస్క్యూ ఆపరేషన్ లో.. టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ శకలాలను ఉత్తర అట్లాంటిక్‌లో 3,800 మీటర్ల లోతులో గుర్తించారు. అంటే అది దాని రేంజ్ మేరకే జర్నీ చేసింది. అయితే టైటానిక్ శకలాలను చూసేందుకు 13,000 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసే క్రమంలో టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ లో భారీ పేలుడు సంభవించిందని అంటున్నారు.