Titan Submersible Found : వందేళ్ల కిందటి టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు టూరిస్టులతో ఈ నెల 18న సముద్ర గర్భానికి వెళ్లి గల్లంతైన.. టైటాన్ సబ్ మెర్సిబుల్ శకలాలను అండర్‌వాటర్ రోబో గుర్తించింది. ఈవిషయాన్ని యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. 1912లో మునిగిపోయిన టైటానిక్ శిథిలాల సమీపంలోనే సబ్‌మెరైన ల్యాండింగ్ ఫ్రేమ్, రియర్ కవర్ శకలాలను గుర్తించినట్టు పేర్కొంది. అయితే, ఇవి టైటాన్‌కు చెందినవేనా? కాదా? అన్నది మాత్రం స్పష్టం చేయలేదు.
అండర్‌వాటర్ రోబో పంపిన సమాచారాన్ని..
అండర్‌వాటర్ రోబో పంపిన సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారని తెలిపింది. మరోవైపు, టైటాన్‌లోని ఆక్సిజన్ గురువారం రాత్రి 7గంటల వరకే నిండుకొని ఉంటుందని టైటాన్ యాజమాన్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అట్లాంటిక్ మహా సముద్రంలో 12వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి గత ఆదివారం బయల్దేరిన సబ్ మెర్సిబుల్ టైటాన్ ఆచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అత్యాధునిక సాంకేతికతతో భారీ ఎత్తున గాలింపు చర్యలు (Titan Submersible Found) కొనసాగుతున్నాయి.
Also read : Types of Milk : పాలల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
టైటాన్ సబ్ మెర్సిబుల్ లో ఎవరు ఉన్నారు ?
హమీష్ హార్డింగ్ (బ్రిటన్), షాజాదా దావూద్(పాకిస్తాన్), షాజాదా దావూద్ కుమారుడు సులేమాన్ దావూద్(పాకిస్తాన్), పాల్ హెన్రీ నార్జియోలెట్(ఫ్రాన్స్), ఓషన్‌గేట్ CEO స్టాక్టన్ రష్ (అమెరికా)లు సబ్మెర్సిబుల్లో మరణించారని టూర్ నిర్వాహక సంస్థ ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ వెల్లడించింది. వారంతా “సాహసం యొక్క ప్రత్యేక స్ఫూర్తిని పంచుకున్నారు” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది . టైటాన్ సబ్ మెర్సిబుల్ కు పైలట్ గా ఓషన్‌గేట్ CEO స్టాక్టన్ రష్ వ్యవహరించారు.
ఆలా చేస్తుండగా.. సబ్ మెర్సిబుల్ లో భారీ పేలుడు
అట్లాంటిక్ మహా సముద్రం అడుగుభాగంలోని వందేళ్ల కిందటి టైటానిక్ ఓడ శకలాలను చూసేందుకు.. 13,000 అడుగుల ఎత్తు నుంచి డైవింగ్ చేస్తున్న క్రమంలో టైటాన్ సబ్మెర్సిబుల్లో భారీ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. సముద్రపు అడుగుభాగంలో ఒక్కసారిగా ఏర్పడిన ప్రతికూల వాతావరణమే ఈ పేలుడుకు కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈమేరకు అమెరికా కోస్ట్ గార్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది.