Super Earth: ఆ రెండు గ్రహాలపై ఏడాదికి 18 గంటలే.. “జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్” ఫోకస్ వాటిపైనే!!

భూమితో పాటు ఎన్నో గ్రహాలపై నాసాకు చెందిన "జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్" అధ్యయనం చేస్తోంది.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 09:15 PM IST

భూమితో పాటు ఎన్నో గ్రహాలపై నాసాకు చెందిన “జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్” అధ్యయనం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన ఈ టెలిస్కోప్ మరో అరుదైన పరిశోధనకు సిద్ధం అవుతోంది. సూర్యుడు ఒక నక్షత్రం.

సూరీడులా నిత్యం కణకణ మండే గోళాలకు అత్యంత దగ్గరగా ఉండే భూమిని పోలిన గ్రహాలపై ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఎటువంటి భౌగోళిక మార్పులు జరుగుతాయి? అనే దానిపై జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దృష్టి సారించనుంది. పాలపుంత అవతల “55 cancri e”, “LHS 3844b” అనే రెండు గ్రహాలు ఉంటాయి.

అచ్చం భూమిని పోలిన విధంగా ఉండే ఈ గ్రహాలు వాటి నక్షత్రాలకు (సూర్యుళ్లకు) అత్యంత చేరువగా కదలాడుతుంటాయి. సమీపంలోని నక్షత్రం (సూర్యుడి) చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయడానికి “55 cancri e”, “LHS 3844b” గ్రహాలకు 11 గంటల సమయమే పడుతుంది. వాటిపై ఒక ఏడాదిలో ఎన్ని రోజులో తెలుసా? కేవలం18 గంటలే. ఇంత తక్కువ వ్యవధి ఎందుకంటే.. తమ నక్షత్రం(సూర్యుడి) చుట్టూ తిరిగేందుకు వాటికి పట్టే సమయం చాలా తక్కువ. “55 cancri e” గ్రహంపై పగలు , రాత్రి అనేవి బుధగ్రహాన్ని పోలిన విధంగా ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.