Site icon HashtagU Telugu

Trump Link : మాస్కో ఉగ్రదాడి.. తెరపైకి ట్రంప్ పేరు.. ఎందుకు ?

Trump Link

Trump Link

Trump Link : రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌పై ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు తెరపైకి వచ్చింది. 2013 సంవత్సరం నాటికి ట్రంప్ కేవలం అమెరికా అధ్యక్షుడు కాలేదు. అప్పట్లో ఆయన ఒక వ్యాపారవేత్త హోదాలో రష్యాతో మంచి సంబంధాలను నెరిపేవారు. స్వయంగా ట్రంప్ చొరవ చూపి 2013 సంవత్సరంలో క్రోకస్ సిటీ హాల్‌లో మిస్ యూనివర్స్ అందాల పోటీలను నిర్వహించారు. దానికి స్వయంగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కు హాజరుకావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా ఆహ్వానించానని ఆ కార్యక్రమం సందర్భంగా ట్రంప్ చెప్పారు. అయితే పుతిన్ రాలేదు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :60 Killed : 60 మంది మృతి, 100 మందికి గాయాలు.. రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రదాడి

Also Read : IPL 2024 : బోణీ కొట్టిన CSK

రష్యాలోని మాస్కోలో ఉన్న క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. తాము తెచ్చుకున్న బాంబులు విసిరారు.  ఈ ఘటనలో 60 మంది మృతిచెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఈవివరాలను రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ కూడా ధ్రువీకరించింది. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ‘ఫిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమం జరుగుతుండగా ఈ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు విసిరిన బాంబుల ధాటికి  కన్సర్ట్‌ హాల్‌ భవనంపై మంటలు చెలరేగాయి. నల్లటి పొగలు వ్యాపించాయి. చివరకు భవనమంతా మంటలు వ్యాపించాయి.