60 Killed : రష్యా అట్టుడికింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఎన్నడూ జరగనంత పెద్ద ఉగ్రదాడి మాస్కోలో జరిగింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. తాము తెచ్చుకున్న బాంబులు విసిరారు. ఈ ఘటనలో 60 మంది మృతిచెందగా(60 Killed), 100 మందికిపైగా గాయపడ్డారు. ఈవివరాలను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ కూడా ధ్రువీకరించింది. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్‌నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతుండగా ఈ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు విసిరిన బాంబుల ధాటికి కన్సర్ట్ హాల్ భవనంపై మంటలు చెలరేగాయి. నల్లటి పొగలు వ్యాపించాయి. చివరకు భవనమంతా మంటలు వ్యాపించాయి.
We’re now on WhatsApp. Click to Join
తొలుత భవనంలోనికి ప్రవేశించిన దుండగులు అక్కడున్న వారిపైకి కాల్పులకు తెగబడ్డారు. సంగీత కార్యక్రమం అయిపోవడంతో బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాక.. ప్రాణాలను కాపాడుకునేందుకు హాల్‌లోని సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హాల్‌లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడం, భయాందోళనలతో ప్రజలు పారిపోతుండటం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. ఉగ్రదాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఒకరిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించింది. దీనిపై అమెరికా వైట్‌హౌజ్ స్పందిస్తూ.. ఘటన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ కిర్బీ పేర్కొన్నారు.
Also Read : Devara 2nd Heroine : దేవర టీం కు భారీ షాక్ ఇచ్చిన హీరోయిన్..తలపట్టుకున్న మేకర్స్
పాత ఘటనలు..
- 2002లో చెచెన్ మిలిటెంట్లు మాస్కో థియేటర్‌లో దాదాపు 800 మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో రష్యన్ ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి వారిని విడిపించాయి. ఈ క్రమంలో 129 మంది బందీలు, 41 మంది మిలిటెంట్లు చనిపోయారు.
- 2004లో 30 మంది చెచెన్ సాయుధులు బెస్లాన్‌లోని ఓ పాఠశాలను ఆధీనంలోకి తీసుకొని వందల సంఖ్యలో బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించే క్రమంలో సుమారు 330 మంది చనిపోయారు. వారిలో సగం వరకు చిన్నారులే ఉన్నారు.