Site icon HashtagU Telugu

Siddharth Mallya : విజయ్‌మాల్యా ఎస్టేట్‌లో సిద్ధార్థ్‌ మాల్యా పెళ్లి.. క్రైస్తవ సంప్రదాయంలో వేడుక

Siddharth Mallya

Siddharth Mallya : మన దేశంలోని బ్యాంకులను నిండా ముంచి పారిపోయిన విజయ్‌మాల్యా కుమారుడు సిద్ధార్థ్‌ మాల్యా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడో తెలుసా? విజయ్ మాల్యా నివసిస్తున్న లండన్‌లోనే !! శనివారం రోజు లండన్‌ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఉన్న లేడీవాక్‌ ఎస్టేట్‌ వేదికగా ప్రియురాలు జాస్మిన్‌ను సిద్ధార్థ్‌ మాల్యా క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు.  ఇద్దరూ ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి జరిగిన  విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా జాస్మిన్‌ వెల్లడించింది. విజయ్ మాల్యా పరారీ వ్యవహారం నేపథ్యంలో ఈ పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే పిలిచారు. వివాహ అతిథుల జాబితాలో అమెరికా నటి ఇమ్మె హార్ట్‌ ఉన్నారు. సిద్ధార్థ్‌ మాల్యా(Siddharth Mallya), జాస్మిన్‌లకు ఇమ్మె హార్ట్‌ మిత్రురాలు.

We’re now on WhatsApp. Click to Join

లేడీవాక్‌ ఎస్టేట్‌‌ విజయ్‌ మాల్యాదే

లేడీవాక్‌ ఎస్టేట్‌‌ను విజయ్‌ మాల్యా 2015లో కొన్నారు. అప్పట్లో ఈ ఎస్టేట్‌ను కొనేందుకు  ఆయన రూ.100 కోట్ల దాకా ఖర్చుపెట్టారట. గతంలో ఈ ఎస్టేట్‌ ఎఫ్‌-1 రేసింగ్‌ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ తండ్రి ఆంటోనీ పేరిట ఉండేది. మాల్యా కొన్న తర్వాత దీనిలో రెండేళ్లపాటు చాలా మార్పులు చేశారు. ఈ పనుల కోసం అప్పట్లో దేశవిదేశాల నుంచి కళాకారులు, నిర్మాణ రంగ నిపుణులను విజయ్ మాల్యా ప్రత్యేకంగా అక్కడికి పిలిపించారట. ఈ ఎస్టేట్  దాదాపు 30 ఎకరాల్లో ఉంది. ఇందులో  మూడు ప్రధాన భవనాలు, పలు ఔట్‌ హౌసులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, టెన్నిస్‌ కోర్టులు కూడా ఉన్నాయి. ఇక్కడున్న గ్యారేజీలో విజయ్ మాల్యాకు చెందిన విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

Also Read :Lokesh Vs Jagan : రూ.600 కోట్ల స్థలాలను వైసీపీ ఆఫీసులకు కట్టబెడతావా ? : లోకేష్

టవర్స్‌పైనే పెంట్ హౌస్.. హెలిప్యాడ్ కూడా

విజయ్ మాల్యాకు చెందిన బెంగళూరులోని ప్రతిష్టాత్మక కింగ్‌ ఫిషర్‌ టవర్స్‌పై ఇంద్రభవనం లాంటి పెంట్‌హౌస్‌ ఉంది. దాదాపు 400 అడుగుల ఎత్తులో దీన్ని విజయ్ మాల్యా నిర్మించుకున్నారు. కింగ్‌ ఫిషర్‌ టవర్స్‌‌ను నిర్మించిన 4.5 ఎకరాల స్థలం విజయ్ మాల్యా పూర్వీకులది. దీనిపై ఉన్న పెంట్‌హౌస్‌‌లో  హెలీప్యాడ్‌, ఇన్ఫినిటీ పూల్ లాంటి  విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. హెలిప్యాడ్‌తో రెండు అంచెలలో 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

Also Read :Pooja Tips: వాడిన పూలతో పూజ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?