Site icon HashtagU Telugu

Brahmanda Yoga : శనీశ్వరుడి తిరోగమనం.. ఆ మూడు రాశులవారికి బ్రహ్మాండ యోగం!

Brahmanda Yoga

Brahmanda Yoga : గ్రహాల కదలికలలో వచ్చే మార్పుల ప్రభావం మనుషుల జీవితాలపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతుంటారు. శని గ్రహం కదలికలలో త్వరలో కీలక మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిగ్రహం జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు తిరోగమన దిశలో కదలనున్నాడు. అంటే నాలుగైదు నెలల పాటు శనీశ్వరుడు తిరోగమనంలోనే ఉంటాడు. దీనివల్ల మూడు రాశుల వారికి బ్రహ్మాండ యోగం(Brahmanda Yoga) ప్రాప్తిస్తుంది.  ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join

వృశ్చిక రాశి

  • శనీశ్వరుడి తిరోగమనం ప్రభావంతో వృశ్చిక రాశిలోని పలువురికి ఆదాయం పదింతలు పెరుగుతుంది.
  • కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మంచి అవకాశాలు దక్కుతాయి.
  • కొత్త పెట్టుబడి భాగస్వాములు దొరకుతారు.
  • జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు వృశ్చిక రాశి వ్యక్తులు ఆర్థికంగా బలపడతారు. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి.

కన్యా రాశి

  • శనీశ్వరుడి తిరోగమనం ప్రభావంతో కన్యారాశిలోని పలువురికి వృత్తి, వ్యాపారాలు కలిసొస్తాయి. లాభాలను గడిస్తారు.
  • కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
  • ఈ రాశిలోని కొందరు విద్యార్థులకు ఈ నాలుగు నెలల కాలం చాలా శుభకరం.
  • ప్రతి పనిలో దాదాపుగా సానుకూల ఫలితాలు వస్తాయి.

Also Read :MP Dharmapuri Arvind : ‘‘ఐ విల్ మిస్ యూ డ్యాడీ’’.. డీఎస్ కుమారుడు ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్

తులారాశి

  • శనీశ్వరుడి తిరోగమనం ప్రభావంతో తులారాశిలోని పలువురికి  సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి.
  • చాలా రోజులుగా పెండింగ్​లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి.
  • ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికీ కొత్త ఛాన్స్‌లు లభిస్తాయి.
  • కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు దృఢపడుతాయి.
  • కొత్తగా పెట్టుబడులు పెట్టాలని భావించే తులారాశి వారికి జూన్ 29 నుంచి నవంబర్ 15 మధ్యలో మంచి ముహూర్తాలు దొరుకుతాయి.