Site icon HashtagU Telugu

Mothers Day 2024 : పురాణాల్లో లెజెండరీ మదర్స్.. వారి త్యాగనిరతికి హ్యాట్సాఫ్

Mothers Day 2024

Mothers Day 2024

Mothers Day 2024 : ‘‘ఎక్కడైనా, ఎప్పుడైనా చెడ్డకుమారుడు ఉంటాడేమో కానీ చెడు తల్లి ఎక్కడా ఉండదు’’ అని పెద్దలు చెప్పారు. ఇదే నిజం. అమ్మ గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆమె పంచిన ప్రేమను వెలకట్టలేం. చేతులు జోడించి ప్రేమగా నమస్కరించడం తప్ప అమ్మకు మనం ఏమీ ఇవ్వలేం. పిల్లల నుంచి ఏమీ ఆశించకుండా అమాయకంగా ఉండే గొప్పతనానికి ప్రతిరూపమే అమ్మ. ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లలతోనే నిలబడే ధీశాలి అమ్మ. ఇలాంటి లెజెండరీ మదర్స్ మన పురాణాల్లోనూ ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

హిడింబి

హిడింబి.. భీముడిని గాంధర్వ వివాహం చేసుకుంటుంది. వీరి ప్రేమకు సాక్ష్యమే ఘటోత్కచుడు.  హిడింబి గొప్ప అమ్మ కూడా. ఘటోత్కచుడు పుట్టిన కొంతకాలానికి భీముడు తన పాండవ సోదరులతో కలసి అజ్ఞాతవాసానికి వెళ్లిపోతాడు. అనంతరం కుమారుడు ఘటోత్కచుడిని హిడింబి యుద్ధ విద్యల్లో ప్రవీణుడిగా తీర్చిదిద్దుతుంది. పాండవుల గొప్పదనం గురించి చెబుతూ వారిపై అభిమానం కలిగేలా చేస్తుంది. అవసరమైనప్పుడు వారికి సహకారం అందిచాలని చెబుతుంది. తల్లి ఆజ్ఞ మేరకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరఫున పోరాడి ఘటోత్కచుడు వీరమరణం పొందుతాడు.

శకుంతల 

శకుంతల.. మేనక-విశ్వామిత్రుల కుమార్తె.  శకుంతల జన్మించిన తర్వాత విశ్వామిత్రుడు సన్యాసిగా మారుతాడు. మేనక ఇంద్ర లోకానికి వెళ్లిపోతుంది.  ఇలా తల్లిదండ్రులకు దూరమైన శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతుంది. కొంతకాలానికి ఆ ఆశ్రమం వైపు వేటకు వచ్చిన దుష్యంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఫలితంగా ఆమెకు ఓ బిడ్డ జన్మిస్తాడు. అతడి పేరు భరతుడు. శాపఫలితంగా దుష్యంతుడి నుంచి శకుంతల తిరస్కారానికి గురవుతుంది. అయినా ఆమె కుంగిపోదు. కొడుకును పెంచి వీర యోధుడిగా తయారు చేస్తుంది.

సీతాదేవి 

సీతాదేవి గురించి మనకు తెలుసు. జనకుడి కుమార్తె సీతాదేవి. శ్రీరాముడితో వివాహం అనంతరం సీతాదేవి అయోధ్యలోకి అడుగుపెట్టింది. అనంతరం భర్తతో కలిసి 14 ఏళ్ల వన వాసానికి పయనమైంది. అడవిలో ఉండగా రావణుడు మాయా సన్యాసి వేషంలో వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్లిపోయాడు. రామ-రావణ యుద్ధం తర్వాత మళ్లీ అయోధ్యలోకి సీతాదేవి అడుగుపెట్టింది. ఈ టైంలో  లోకుల నిందలకు సమాధానంగా సీతాదేవిని శ్రీరాముడు మళ్లీ అడవుల్లోనే వదిలేస్తాడు. అప్పటికే సీతమ్మ తల్లికాబోతోంది. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరిన సీతాదేవి లవకుశులకు జన్మనిస్తుంది. తండ్రి శ్రీరాముడి గొప్పతనం గురించి చెబుతూ తన పిల్లలను సీతాదేవి పెంచింది. రాముడి వారసులుగా వాళ్లకు అవసరమైన యుద్ధవిద్యలను నేర్పించి  యోధులుగా తీర్చిదిద్దింది.

Also Read : Iran Vs Israel : ఇజ్రాయెల్ ఖబడ్దార్.. అణుబాంబులు తయారు చేస్తాం : ఇరాన్

కుంతి

పాండవుల తల్లి కుంతి. కన్యగా ఉన్న సమయంలో దూర్వాస మహర్షి ద్వారా కుంతి ఓ మంత్రోపదేశం పొందుతుంది. ఆ మంత్రోచ్ఛారణ చేసి ఏ దేవుడిని కోరుకున్నా.. వారి అంశలో పిల్లలు జన్మిస్తారని ఆయన కుంతిని ఆశీర్వదిస్తాడు. అది నిజమో కాదో అని తెలుసుకునేందుకు కుంతి చేసిన ప్రయత్న ఫలితంగా సూర్యుడి ద్వారా కర్ణుడు జన్మిస్తాడు. లోకుల నిందలకు భయపడి కర్ణుడిని కుంతి వదిలేస్తుంది. పాండురాజుతో పెళ్లయ్యాక .. తనకున్న శాపఫలితంగా వంశం నిర్వీర్యం అవుతుందని పాండురాజు ఆవేదన చెందుతాడు. ఇది విన్న కుంతి తనకున్న మంత్రోపదేశం శక్తి గురించి భర్తకు వివరిస్తుంది. భర్త అంగీకారంతో యమధర్మరాజు, ఇంద్రుడు, వాయువు, అశ్వినీదేవతలను స్మరించి పాండవులకు కుంతి జన్మనిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి పాండురాజు మరణిస్తాడు. అప్పటి నుంచి పాండవులను కుంతి వీరులుగా తీర్చిదిద్దుతుంది.  కురుక్షేత్ర యుద్ధంలో గెలిచేదాకా కొడుకుల వెంటే కుంతి ఉంటుంది.

Also Read :Hardeep Nijjar : ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో నాలుగో భారతీయుడి అరెస్ట్