Site icon HashtagU Telugu

Iran Vs Israel : ఇజ్రాయెల్ ఖబడ్దార్.. అణుబాంబులు తయారు చేస్తాం : ఇరాన్

Israel Vs Iran

Israel Vs Iran

Iran Vs Israel : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి తమ ఉనికికి ముప్పు ఏర్పడే పరిస్థితులే వస్తే..  దేశ సైనిక సిద్ధాంతాన్ని మార్చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు కమల్ ఖర్రాజీ వెల్లడించారు. ‘‘అణుబాంబును తయారు చేయాలనే ఆలోచన మాకు లేదు. అయితే ఇరాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే.. మా సైనిక సిద్ధాంతాన్ని మార్చడం.. అణుబాంబులు తయారు చేయడం తప్ప వేరే మార్గం ఉండదు’’ అని ఆయన స్పష్టం చేశారు.  ఇజ్రాయెల్‌ – ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేశాయి.  ఈ ఏడాది ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా వైమానిక దాడులు చేసింది.

We’re now on WhatsApp. Click to Join

‘‘అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా అయతుల్లా ఖమేనీ గతంలో ఫత్వా జారీ చేశారు. అయితే బాహ్య ఒత్తిళ్లు, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ తన నిర్ణయాలను మార్చుకుంటుంది. దేశ రక్షణ కోసం అవసరమైతే  అణుశక్తిగా మారుతుంది’’ అని కమల్ ఖర్రాజీ  వెల్లడించారు. ‘‘ఒకవేళ ఇజ్రాయెల్ మా అణు కేంద్రాలపై దాడి చేసినా.. మేం వెంటనే అణుబాంబుల తయారీ దిశగా అడుగులు వేస్తాం’’ అని ఆయన తేల్చి చెప్పారు.

Also Read : Mothers Day 2024 : అమ్మ అంటే ఏదో హుషారు.. చెప్పలేని ధైర్యం..!

ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) అధిపతి రాఫెల్ గ్రోస్సీ స్పందించారు. ఇరాన్ నుంచి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని వెల్లడించారు. ఇరాన్ అణు కార్యకలాపాల సమాచారాన్ని సేకరించే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత స్థితి ఆందోళనకరంగా ఉందని , దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని రాఫెల్ చెప్పారు.  అణుశక్తి కార్యకలాపాలపై సహకారాన్ని అందిస్తామని 2023లో తమతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇరాన్.. ఇప్పుడు ఆ దిశగా తమతో కలిసి నడవడం లేదని ఆయన తెలిపారు.

Also Read :Kitchen Tips : బియ్యం నిల్వలో పురుగులు ఉన్నాయా? వాటిని తొలగించడానికి ఇలా చేయండి..!