Meta – Political : ఎన్నికల వేళ పొలిటికల్‌ కంటెంట్‌పై ఫేస్‌బుక్ కీలక నిర్ణయం

Meta - Political : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్ అన్ని రంగాల కంపెనీలకు హాట్ స్పాట్ లాంటిది.

  • Written By:
  • Updated On - February 13, 2024 / 11:10 AM IST

Meta – Political : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్ అన్ని రంగాల కంపెనీలకు హాట్ స్పాట్ లాంటిది. ప్రత్యేకించి సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్ బుక్)కు కూడా ఇండియా చాలా కీలకం. మన దేశంలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి చాలా దేశాల్లోనే ఈ ఏడాది ఎలక్షన్ ఇయరే. ఈనేపథ్యంలో అపర కుబేరుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాజకీయ నేతలకు షాకిచ్చేదే. పొలిటికల్‌ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ (Instagram), థ్రెడ్స్‌ (Threads) ప్లాట్‌ఫామ్‌లలో రెకమెండ్‌ చేయబోమని మెటా తేల్చి చెప్పింది. ఫేస్‌బుక్‌లో కూడా అవాంఛిత పొలిటికల్‌ కంటెంట్‌‌కు కళ్లెం వేసే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు సోషల్‌ మీడియా బలమైన వేదికగా మారింది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మెయిన్‌ మీడియా కంటే సోషల్‌ మీడియాపైనే నాయకులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. మెటా తాజా నిర్ణయంతో ఇకపై పొలిటికల్‌ కంటెంట్‌ అందరికీ చేరదు. పొలిటికల్‌ అకౌంట్లు, పేజీలు ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్‌(Meta – Political) చేరుతుంది.

We’re now on WhatsApp. Click to Join

పొలిటికల్ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రమే..

పొలిటికల్ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని మెటా వెల్లడించింది. పొలిటికల్ కంటెంట్‌పై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు .. ఆ తరహా  కంటెంట్‌ను పోస్ట్ చేసే అకౌంట్లను ఫాలో అయితే తాము అడ్డుకోమని మెటా తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram), థ్రెడ్స్‌ (Threads)లలో పొలిటికల్ కంటెంట్ సిఫార్సులను చూడాలా వద్దా అనేది పూర్తిగా యూజర్ల ఇష్టమని చెప్పింది.   ఈ మేరకు ఎంపిక చేసుకునే ఆప్షన్లను యూజర్ల కోసం త్వరలోనే తీసుకొస్తామని మెటా అంటోంది.ఇదే విధమైన నియంత్రణ రాబోయే రోజుల్లో ఫేస్‌బుక్‌లో కూడా అమల్లోకి వస్తుందని ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌ ఆడమ్ మోస్సేరి థ్రెడ్స్‌ ఒక పోస్ట్‌లో వివరించారు.

ఏఐ ఫొటోల గుర్తింపు

‘‘ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి కావాలని మేం కోరుకుంటున్నాం. అందుకే ఫాలో కాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్‌ను ముందస్తుగా ప్రమోట్‌ చేయబోం. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది’’ అని  ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌ ఆడమ్ మోస్సేరి థ్రెడ్స్‌ వివరించారు.