Site icon HashtagU Telugu

Zuckerberg Bunker : 2వేల కోట్లతో ఫేస్‌బుక్ ఓనర్ రహస్య బంకర్.. విశేషాలివీ

Zuckerberg Bunker

Zuckerberg Bunker

Zuckerberg Bunker : ప్రపంచ కుబేరులు ఏది చేసినా అంతటా చర్చనీయాంశంగా మారుతుంటుంది. ప్రపంచంలోని టాప్ -10 ధనవంతుల్లో ఒకరైన ఫేస్ బుక్ (మెటా) అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడో ప్రపంచం యుద్ధం త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఆయన హై అలర్ట్ అయ్యారట. అమెరికాలోని హవాయి ద్వీపాల్లోని కవాయి ప్రాంతంలో దాదాపు 1400 ఎకరాల భూమిని 2014 ఆగస్టులోనే మార్క్‌ జుకర్‌బర్గ్‌ కొన్నారట. ఆ భూమిలో విలాసవంతమైన ఎస్టేట్‌.. దానిలోనే రహస్య బంకర్‌ను(Zuckerberg Bunker) ఏర్పాటు చేసుకోవాలనే ప్లాన్‌లో జుకర్‌బర్గ్ ఉన్నారట.

We’re now on WhatsApp. Click to Join

జుకర్‌బర్గ్ రహస్య బంకర్ విశేషాలివీ.. 

Also Read : Nicholai Sachdev : వరలక్ష్మీ శరత్‌‌కుమార్‌ కాబోయే భర్త నికోల‌య్ సచ్‌‌దేవ్‌ ఎవరు ?

Also Read : Ram Charan Vs Shah Rukh : అంబానీ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌కు అవమానం.. ఏం జరిగింది ?

బంకర్ల ప్రధాన లక్ష్యం అదే..

బంకర్ల ఏర్పాటు ప్రధాన లక్ష్యం యుద్ధాలు, విపత్తుల నుంచి రక్షణ పొందడం కోసమే. సింపుల్‌గా చెప్పాలంటే.. భూమిలో (అండర్‌గ్రౌండ్‌) రహస్యంగా కట్టుకునే గదులు, ఇళ్లనే బంకర్లు అనొచ్చు. నలుగురికి సరిపడే స్థాయి నుంచి.. పదుల సంఖ్యలో తలదాచుకోవడానికి వీలుగా బంకర్లను కట్టుకుంటుంటారు. అత్యవసర పరిస్థితిలో పనికొచ్చే మందులు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్, నీళ్లు, ఆహారం, జనరేటర్లు వంటివాటిని బంకర్లలో సిద్ధంగా ఉంచుకుంటారు.