Site icon HashtagU Telugu

Lioness Sita – Lion Akbar : సింహాల జంట సీత, అక్బర్‌లపై కోర్టుకెక్కిన వీహెచ్‌పీ.. ఎందుకు ?

Lioness Sita Lion Akbar

Lioness Sita Lion Akbar

Lioness Sita – Lion Akbar : ఆడ సింహం సీత.. మగ సింహం అక్బర్‌లను  ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కోర్టును ఆశ్రయించింది. సింహాలకు  సీత, అక్బర్‌ అనే పేర్లు పెట్టి ఒకే బోనులో ఉంచడం అంటే హిందువుల మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడమే అవుతుందని వీహెచ్‌పీ తరఫు న్యాయవాది వాదన వినిపించారు.ఈ రెండు సింహాల పేర్లను మార్చేలా  పశ్చిమ బెంగాల్‌లోని శిలిగుడి సఫారీ పార్క్‌ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టును కోరింది.

We’re now on WhatsApp. Click to Join

త్రిపుర రాష్ట్రంలోని సిపాహీజలా జులాజికల్‌ పార్క్‌ నుంచి ఒక మగ, మరో ఆడ సింహాన్ని పశ్చిమబెంగాల్‌ అధికారులు ఈ నెల 12న శిలిగుడి సఫారీ పార్క్‌కు తీసుకొచ్చారు. అటవీ శాఖ అధికారులే ఆ సింహాలకు సీత, అక్బర్ అనే పేర్లు పెట్టారని వీహెచ్‌పీ ఆరోపిస్తోంది. జంతువుకు సీత అనే పేరు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని వీహెచ్‌పీ పేర్కొంది. వెంటనే సీత పేరు పెట్టిన ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్‌ చేసింది. భవిష్యత్తులో దేశంలోని జూ పార్క్‌లోని జంతువులకు మతానికి చెందిన దేవుళ్లు, దేవతల పేర్లు పెట్టకుండా(Lioness Sita – Lion Akbar) ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో వీహెచ్‌పీ తెలిపింది.

Also Read :Group 2 Exam : గ్రూప్ 2, ఎస్‌బీఐ ఎగ్జామ్స్ ఈనెల 25నే.. ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం

ఈ అంశంపై కోల్‌కతా హైకోర్టులోని జల్పాయ్‌గురి సర్క్యూట్‌ బెంచ్‌‌ను ఈ నెల 16న  వీహెచ్‌పీ ఆశ్రయించింది. ఈ పిటిషన్‌లో బెంగాల్ అటవీ శాఖ అధికారులు, బెంగాల్‌ సఫారీ పార్క్‌ డైరెక్టర్‌ను వీహెచ్‌పీ ప్రతివాదులుగా చేర్చింది.దీనిపైఈ నెల 20న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది. పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు మాత్రం వీహెచ్‌పీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. త్రిపుర నుంచి తీసుకొచ్చిన సింహాలకు ఇంకా ఎలాంటి పేర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. జంతువుల మార్పిడిలో భాగంగా బెంగాలీ సఫారీ పార్క్‌కి IL26, IL27 అనే రెండు సింహాలను అధికారులు తీసుకొచ్చారు.

Also Read : Free Admissions : ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు