Site icon HashtagU Telugu

Inspiration: ఏనుగుల జీవితాల్లో ‘గోవింద్’ వెలుగులు!

Gaja Raksha

Gaja Raksha

ఏనుగులు.. ఇండియన్ కల్చర్ లో ఓ భాగం. తరతరాలుగా వాటి జీవితం మనుషులతో ముడిపడి ఉంది. ప్రముఖ ఆలయాల్లో దగ్గర గజరాజులు ఆశీర్వాదాలు అందిస్తుంటాయి. ఇక తిరుపతి, శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. మరి అలాంటి ఏనుగులు ఒకవైపు పూజకు నోచుకుంటుంటే.. మరోవైపు యజమానుల చేతుల్లో బంధి అవుతూ చిత్రహింసలకు గురవుతున్నాయి. కనీసం తిండి కూడా ఇవ్వకపోవడంతో బక్కచిక్కిపోతున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ గోవింద్ గురుర్ రాయిసన్ ను ఆలోచనలో పడేశాయి.

‘గజ రక్ష’ అనే సంస్థ ఏనుగులకు మెరుగైన జీవితాన్ని అందించడానికి కృషి చేస్తున్నాడీయన. హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఈ కార్యకర్త ఏనుగులకు సాయం చేస్తూ.. కొత్త జీవితం ప్రసాదిస్తున్నాడు. తన సంస్థ ద్వారా ఎన్నో ఏనుగులను కాపాడిన ఈయన విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ దేశంలో బందీలుగా ఉన్న ఏనుగులు ఎన్నో కష్టాలు పడుతున్నాయి. క్రూరంగా కొట్టడం నుంచి ప్రార్థన స్థలాల బయట గంటలతరబడి నిలబడటం, కొన్నిసార్లు తగినంత ఆహారం తీసుకోకపోవడం అందకపోవడంతో బక్కచిక్కిపోతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈయన దుధ్వా నేషనల్ పార్క్ లో పనిచేశాడు. అక్కడ జంతువుల సంరక్షణతో పాటు, అతను పర్యావరణాన్ని కాపాడటం గురించి 100 మంది గిరిజన పిల్లలకు మెళకువలు నేర్పించాడు. తరువాత, అతను పుదుచ్చేరి సమీపంలోని బందీ ఏనుగు శిబిరంలో సెంటర్ మేనేజర్‌గా చేరాడు. గాయపడిన మూడు ఏనుగులను సంరక్షించాడు. అటవీ ప్రాంతాల్లో ఏనుగులు సురక్షితంగా ఉన్నప్పటికీ, బందిఖానాలో ఉన్న జంతువులు ఎక్కువగా నష్టపోతున్నాయని గోవింద్ చెప్పారు. ఏనుగు రోజూ కొంత దూరం నడవాలి కానీ బందీలుగా ఉన్న ఏనుగులు ఎక్కువ గంటలు నిలబడేలా చేస్తారు. “కొందరు ఒక ప్రదేశంలో బంధిస్తారు. దాని కారణంగా ఫుట్‌ప్యాడ్‌లలో రంధ్రాలు ఏర్పడతాయి. పాదాలు కూడా సెప్టిక్‌గా మారతాయి” అని ఆందోళన వ్యక్తం చేశాడు.

పర్యాటకులను తమ వీపుపై మోసుకెళ్లడం వల్ల ఏనుగుల వీపు భాగం విరిగిపోతుంది. వాటికి సకాలంలో చికిత్స అందించకపోవడంతో విపరీతమైన నొప్పికి గురవుతున్నాయి. కొన్నిసార్లు, ఏనుగులు తరచూ భారీ లోడ్‌లను మోసుకెళ్లినప్పుడు వాటి వెనుక, తుంటిపై ప్రాణాంతక పుండ్లు ఏర్పడతాయని గోవింద్ భయంకరమైన నిజాలను బయటపెట్టాడు.  ఈ ఏనుగుల అక్రమ రవాణా, బందిఖానాలో ఉన్న ఏనుగులకు సాయం చేయడానికి వెళ్ళినప్పుడు నన్న చంపేస్తానని బెదిరించారు. మరొక గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఏనుగులు స్టాక్‌హోమ్ సిండ్రోమ్‌తో బాధపడుతుంటాయి. 40 మందికి పైగా మహోత్‌లతో పనిచేసిన గోవింద్ బందీలుగా ఉన్న ఏనుగుల కోసం స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించే పనిలో ఉన్నారు. ఏనుగు గొలుసులను రబ్బర్‌తో కప్పడం, పెద్ద ఆవరణలను సృష్టించడం, వాటి పాదాలకు రక్షణగా నిలిచేందుకు రబ్బరు చాపను అందించడం, వాటికి నాణ్యమైన ఆహారం అందించడం చేస్తే ఎనుగుల జీవితం కాలం పెరుగుతుందని అంటున్నాడీయన.

Exit mobile version