Salary Protection: శాలరీ ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఏంటి.. ఆ ప్లాన్ ఎవరికి వర్తిస్తుంది?

సాధారణంగా చాలామంది తనకోసం తన కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - July 8, 2022 / 07:30 AM IST

సాధారణంగా చాలామంది తనకోసం తన కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతూ ఉంటారు. అయితే అటువంటి యజమానికి,లేదా అటువంటి వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ కుటుంబ సంపాదన ఒక్కసారిగా ఆగిపోతుంది. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై అంధకారం నెలకొంటుంది. ఇక ఆ కుటుంబ సమస్యలు వర్ణనాతీతం. అదే అటువంటి సందర్భాల్లోనే సహాయపడేది సాలరీ ప్రొటెక్షన్ ప్లాన్. రోజుల్లో చాలావరకు బీమా సంస్థలు శాలరీ ప్రొటెక్షన్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇది ఒక టర్మ్ పాలసీ. హామీ మొత్తం ఏక మొత్తంగా అందించడంతోపాటుగా క్రమమైన ఆదాయాన్ని కూడా అందిస్తూ ఉంది.

దీనిని ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్ అని కూడా అంటారు. అయితే నెలవారిగా అందించే సహాయం పాలసీదారుడు యొక్క జీతం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్లాన్ ని ఎంచుకున్న వారు హామీ మొత్తం ఏ విధంగా నామినీకి అందించాలో పాలసీ కొనుగోలు చేసే సమయంలో భీమా సంస్థకు తెలియజేయాలి. అటువంటి వారి కోసం రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి. అందులో మొదటిది హామీ మొత్తం రెండు భాగాలుగా అంటే ఏక మొత్తం నెలవారీ ఆదాయంగా విభజించవచ్చు. ఈ విధానంలో దేనికి ఎంత మొత్తం కేటాయించాలో కూడా పాలసీదారుడు తెలియజేయాలి.

ఇక మొత్తం హామీని క్రమమైన ఆదాయంగా చెల్లించే విధంగా టర్న్ పాలసీని ఎంచుకోవచ్చు. ఇక పాలసీ ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే.. శాలరీ ఇన్సూరెన్స్ లేదా ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ని కొనుగోలు చేసిన పాలసీదారుడు, కుటుంబ సభ్యులకు నెలవారి ఆదాయంగా ఎంత మొత్తాన్ని అందించాలి అనుకుంటున్నారో తెలియజేయాలి. అయితే ప్రస్తుతం పాలసీదారుడు అందుకుంటున్న టేక్ హోమ్ శాలరీ కి సమానంగా కానీ లేదంటే అంతకంటే తక్కువగానే ఉండాలి. అదేవిధంగా పాలసీ ప్రీమియం చెల్లింపులకు కాలవ్యవధిని ఎంచుకోవాలి.

ఉదాహరణగా 30 సంవత్సరాల వయసున్న వ్యక్తి 10 నుంచి 30 ఏళ్ల వ్యక్తి పాలసీని కొనుగోలు చేయవచ్చు. ప్రీమియంను బీమా సంస్థ నిర్ణయిస్తుంది. అలాగే పాలసీదారుని వయసు ఎంచుకున్న పాలసీ హామీ మొత్తం తదితర అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది. అదేవిధంగా నెలవారీ ఆదాయంలో ఎంత శాతం పెంపుదల ఉండాలి అనేది కూడా భీమా సంస్థ నిర్ణయిస్తుంది. బీమా సంస్థ ఆదాయంపై వార్షికంగా ఐదు నుంచి 6% పెరుగుదలను అందించవచ్చు. ఉదాహరణగా నిలవారీ ఆదాయంగా 50,000 ఎంచుకుంటే పాలసీ తీసుకున్న రెండవ సంవత్సరం ఈ నెల వారి ఆదాయం 53 వేలుకు చేరుకుంటుంది. ఆ తరువాత సంవత్సరం 56,180 గా ఉంటుంది.