Site icon HashtagU Telugu

Weekly Horoscope : ఈవారం వారికి చికాకులు ఎక్కువ.. సెప్టెంబరు 3 నుంచి 9 వరకు రాశి ఫలాలు

Weekly Horoscope 2024 december 9 to 15

Weekly Horoscope  : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం (సెప్టెంబరు 3 నుంచి 9 వరకు) రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈవారం మేషరాశి వారికి చికాకులు అధికముగా ఉండును. పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ధైర్యంగా వ్యవహరించాల్సిన వారం ఇది. గతవారం ఎదుర్కొన్న ఇబ్బందులు కొంతవరకూ తీరిపోతాయి. అప్పులు చేయాలనే ఆలోచన మానుకోవడం మంచిది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలుంటాయి.  ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. పనులు వాయిదా వేస్తారు. దక్షిణామూర్తిని దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుడిని పూజించాలి.

వృషభ రాశి

ఈవారం వృషభ రాశి వారు తమను తాము నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. పెద్ద పెద్ద లావాదేవీలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. వ్యాపారం ఖర్చులతో కూడియున్నటువంటి సమయం. అనవసర వాగ్ధానాలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. దుర్గాదేవిని పూజించాలి.

మిథునం

ఈవారం మిథునరాశి వారికి పెద్దగా కష్టాలు లేవు.  పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ వారం బాగానే ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే సత్ఫలితాలు పొందుతారు. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యం నిర్వహణకు ప్లాన్ చేస్తారు. ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటకం

ఈవారం కర్కాటక రాశి వారు అందరినీ నమ్మవద్దు. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. స్త్రీలతో సంభాషణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా గందరగోళంగా ఉంటుంది. విశ్వసనీయ వ్యక్తి నుంచి సలహా తీసుకున్న తర్వాతే కొత్త పనిని ప్రారంభించండి.  ఉద్యోగులు జాగ్రత్తగా  ఉండాలి. వివాదాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిళ్ళకు గురవుతారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి.

సింహం

ఈవారం సింహరాశి వారు చేసే పనులలో చికాకులు అధికము. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా జాగ్రత్తలు వహించవలసిన సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఈ వారం ప్రేమ ప్రతిపాదన రావొచ్చు..వివాహం దిశగా వెళుతుంది. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి.

కన్య (Weekly Horoscope)

ఈవారం కన్యారాశి వారు ఓ చెడువార్త వినే అవకాశం ఉంది. ఒడిదొడుకులు ఉంటాయి. ఖర్చులు నియంత్రించలేరు కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఖర్చులపరంగా చెడు సమయం. ఏదో రకంగా ధనం కలసివచ్చును. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.  మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి.

Also read:Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..

తుల

ఈవారం తులారాశి వారు అతివిశ్వాసం తగ్గించుకోవడం మంచిది. తొందరపడి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.  ఖర్చులు నియంత్రించుకోవాలి. వాద ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. స్త్రీలకు, విద్యార్థులకు కలసివచ్చే సమయం. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించండి.

వృశ్చికం

ఈవారం వృశ్చిక రాశివారు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. విశ్వసనీయ వ్యక్తుల సలహాలు పాటించడం మంచిది. మీరు గందరగోళ పరిస్థితిలో ఉంటారు.  ఒకే సమయంలో అవకాశాలు చుట్టుముడతాయి.. నిర్ణయం తీసుకోనడం కొంచెం కష్టతరమవుతుంది. కుటుంబ సమస్యలు బాధించును. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రుణ విమోచక అంగారక స్తోత్రం చదవండి.

ధనుస్సు

ఈవారం ధనుస్సు రాశి వారు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి.  నూతన ఆస్తులు కొనేందుకు ఆలోచిస్తారు.  వైవాహిక జీవితం బావుంటుంది.  భౌతిక సుఖాల కోసం ఖర్చు  చేస్తారు. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలించును. సూర్యాష్టకాన్ని పఠించండి. శివాలయంలో అభిషేకం చేయండి.

మకరం

ఈవారం మకర రాశిలోని ప్రేమికుల మధ్య పరస్పర వివాదాలు ఏర్పడొచ్చు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. రాజకీయ ఒత్తిళ్ళ నుంచి మీ యొక్క తెలివితేటలతో బయటపడెదరు. ఒకేసారి అనేక రకాల పనులకు సమయం కేటాయించాల్సి ఉంటుంది.  సినీరంగం, రైతాంగం వారికి సత్ఫలితాలు ఉండబోతున్నాయి. శనికి తైలాభిషేకం చేయండి.

Also read:MP Kesineni Nani : ఎంపీ కేశినేని కీల‌క వ్యాఖ్య‌లు..ముచ్చ‌ట‌గా మూడోసారి..?

కుంభం

ఈవారం కుంభరాశిలోని ఉద్యోగులకు తమ యజమానితో కొన్ని విభేదాలు ఉండొచ్చు. మీరు చేసే ప్రతి పనిలో చికాకులు, ఇబ్బందులు కలుగును. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. గతవారం ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు ఈ వారం పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ఓపికతో పని చేస్తే అంతా సవ్యంగానే సాగుతుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అనుకోకుండా వస్తుంది. ఆస్తి సంబంధిత పనులకు ఈవారం మంచిది. వెంకటేశ్వరస్వామిని పూజించండి.

మీనం 

ఈవారం మీనరాశి వారు అనుకున్న పని సమయానికి జరగకపోతే కోపం తెచ్చుకోవద్దు. మీ విజయం గురించి మీ మనస్సులో ఎలాంటి సందేహాన్ని ఉంచుకోవద్దు. మీరు చేసే పనులు కలసివచ్చును. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడినటువంటి సమయం. రుణ సమస్యలు బాధించును. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.