Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..

Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్నాయి.

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 07:32 AM IST

Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ వేడుకకు అంకురార్ప‌ణ సెప్టెంబ‌రు 17న జ‌రగ‌నుంది. సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ ప్రకటించింది.

Also read : Best Juices: మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే ఈ జ్యూస్ ట్రై చేయండి..!

  • సెప్టెంబర్ 17న అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన ఉంటాయి.
  • 18న ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది.
  • 19న  ఉదయం చిన శేష వాహన కార్యక్రమం, రాత్రి 7 గంటలకు హంస వాహనంపైన శ్రీవారి ఊరేగింపు ఉంటుంది.
  • 20న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యాల పందిరి వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు.
  • 21న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వ భూపాల వాహనంపై శ్రీవారి మాడవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది.
  • 22న శ్రీవారు మోహిని అవతారంలో దర్శనమిస్తారు. సాయంత్రం గరుడ వాహనంపైన ఊరేగుతారు.
  • 23న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనంపైన శ్రీవారు దర్శనమిస్తారు.
  • 24న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల్లో ఊరేగుతారు.
  • 25న రథోత్సవం ఉంటుంది. సాయంత్రం అశ్వవాహనం పై ఊరేగింపు జరుగుతుంది.
  • ఈనెల 26న శ్రీవారి పల్లకీ ఉత్సవం జరుగనుండగా, చక్ర స్నానం, ధ్వజారోహనతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Also read :Rajanala : చెడు అలవాటు కోసం రాజనాల చేసిన పని.. ఒక మంచి కార్యానికి దారి తీసింది..