Google Pay : జూన్ 4 నుంచి గూగుల్ పే బంద్.. ఎందుకు ? ఎక్కడ ?

గూగుల్ పే జూన్ 4 నుంచి పనిచేయదు. ఈవివరాలను గూగుల్ కూడా ధ్రువీకరించింది.

  • Written By:
  • Updated On - May 20, 2024 / 01:04 PM IST

Google Pay : గూగుల్ పే జూన్ 4 నుంచి పనిచేయదు. ఈవివరాలను గూగుల్ కూడా ధ్రువీకరించింది. అయితే గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏయే దేశాలు ప్రభావితం అవుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇండియాపై దీని ఎఫెక్టు ఉంటుందా ? ఉండదా ? అనేది ఇప్పుడు తెెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

జూన్ 3 నుంచి గూగుల్ పే(Google Pay) సేవలు అమెరికాలో అందుబాటులో ఉండవు. మన భారత్‌లో యథావిధిగా దాని సేవలు కంటిన్యూ అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. కేవలం భారత్, సింగపూర్‌లో మాత్రమే జూన్ 4 తర్వాత గూగుల్ పే సేవలు కొనసాగుతాయి. దాదాపు 180 ప్రపంచ దేశాలలో గూగుల్ పే సర్వీసులు గూగుల్ వ్యాలెట్‌కు బదిలీ అయిపోతాయి. జూన్ 4 తర్వాత ఆయా దేశాల్లో యూజర్లు గూగుల్ పే సర్వీసులను వాడలేరు.

ఇప్పుడు లేటెస్ట్ గా గూగుల్ వాలెట్ అనే యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే గూగుల్ పే, గూగుల్ వాలెట్ రెండు యాప్ లనూ మనం వినియోగించవచ్చు.వినియోగదారులు తమ కార్డులు, పాస్‌లు, టిక్కెట్లు, కీలు, ఐడీలను సురక్షితంగా నిల్వ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్, మెక్ డొనాల్డ్స్, క్రోమా, ఎయిర్ ఇండియా, విస్తారా, పీవీఆర్, ఇనోక్స్, లెన్సా కార్ట్ , మెక్ మై ట్రిప్ తదితర సుమారు 20 ప్రముఖ భారతీయ బ్రాండ్‌లతో దీనికి భాగస్వామ్యం ఉంది. వివిధ కార్పొరేట్ కార్డులను కూడా వాలెట్‌లో నిల్వ చేసుకోవచ్చు.  ప్లేస్టోర్ నుంచి గూగుల్ వాలెట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. మీ గూగుల్ ఖాతా ఆటోమేటిక్‌గా యాప్ తో లింక్ చేయబడుతుంది. యాప్‌ను తెరిచి యాడ్ టు వాలెట్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. ఇప్పటికే గూగుల్ పే పనిచేస్తున్నందున గూగుల్ వాలెట్ ను ఉపయోగించి వినియోగదారులు డిజిటల్ పేమెంట్లు చేయలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే గూగుల్ పే అనేది ప్రాథమిక చెల్లింపు యాప్‌గా ఉంటుంది. గూగుల్ వాలెట్ యాప్ మాత్రం నాన్ పేమెంట్ వినియోగ కేసుల కోసం రూపొందించారు.

Also Read : Krishna : ‘సాయిబాబా’గా కృష్ణ ఓ మూవీ చేసారా..? మహేష్ చేతుల మీదుగా ఓపెనింగ్..