Site icon HashtagU Telugu

Rat Glue Traps : ఎలుకలు పట్టే ప్యాడ్లు ఈ-కామర్స్ సైట్ల నుంచి ఔట్.. ఎందుకు ?

Rat Glue Traps

Rat Glue Traps

Rat Glue Traps : ఎలుకలను పట్టడానికి మనం ‘ర్యాట్ గ్లూ ప్యాడ్స్’ను ఉపయోగిస్తుంటాం. ఇంతకు ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జియోమార్ట్‌లలో వీటిని విక్రయించేవారు. ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లలో వీటి సేల్స్‌ను ఆపేశారు.  ‘ర్యాట్ గ్లూ ప్యాడ్స్’ విషయంలో మిగిలిన సంస్థలు కూడా ఈ బాటలోనే నడవాలని యోచిస్తున్నాయి. ఇంతకీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలుసా ? రాబోయే రోజుల్లో గ్లూ ట్రాప్​ అందుబాటులో ఉండకపోవచ్చనే చర్చకు కారణం ఏమిటో తెలుసా ?

We’re now on WhatsApp. Click to Join

ఎలుకల బెడద నుంచి బయటపడటానికి జనం వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. కొందరు విషం పెడతారు. మరికొందరు బోను పెడతారు. ఇంకొందరు గ్లూ ట్రాప్‌ను వాడుతుంటారు. గ్లూ ట్రాప్‌  ద్వారా ఎలాంటి శ్రమ లేకుండానే ఎలుకలను పట్టేయొచ్చు. అందుకే చాలా తక్కువ టైంలోనే వీటి సేల్స్ అమాంతం పెరిగాయి.  అయితే వినియోగదారులకు షాకిచ్చే విషయం ఏమిటంటే.. గ్లూ ట్రాప్‌  ప్యాడ్స్​ను ఇప్పుడు ప్రముఖ ఆన్​లైన్​ స్టోర్స్ తమ సరుకుల జాబితా నుంచి తొలగించాయి. అమెజాన్‌ సహా భారతదేశంలోని అనేక ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్​  గ్లూ ట్రాప్స్​ను అన్ లిస్ట్ చేశాయి. మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ గ్లూ ప్యాడ్స్‌పై బ్యాన్ అమల్లో ఉంది. ఇదంతా ‘పెటా ఇండియా’ సంస్థ పోరాటం వల్ల జరిగింది. ‘పెటా’ అంటే ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’.

Also Read :No Holiday : ఈ సండే రోజు వర్కింగ్ డే.. ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్

మనిషి తన జీవిత సౌఖ్యం కోసం ఎన్నో జీవుల ప్రాణాలు తీస్తున్నాడు. ఎలుకలను గ్లూ ట్రాప్ ద్వారా చంపే పద్ధతి అత్యంత క్రూరంగా ఉంటోందంటూ పెటా సంస్థ పెద్ద ఉద్యమమే చేసింది. మాంసం కోసం ఏదైనా జంతువును మనం చంపేటప్పుడు, దాన్ని ప్రాణాన్ని కొన్ని క్షణాల్లోనే తీసేస్తాం. కానీ ఈ గ్లూ ప్యాడ్‌పై అతుక్కునే ఎలుక మాత్రం నరకాన్ని చూస్తోంది.  అత్యంత దారుణంగా గంటల తరబడి ప్యాడ్‌కు అతుక్కుపోయి అలమటించి ప్రాణాలు కోల్పోతోంది. గ్లూ ట్రాప్ పెట్టిన వాళ్లు దానిపై ఎలుక ట్రాప్ అయిన వెంటనే యాక్షన్ తీసుకుంటే బెటర్. కానీ చాలావరకు అలా జరగడం లేదు. ఈ ఆలస్యం కారణంగా  దానిపై అతుక్కుపోయి ఎలుక చిత్రవధను అనుభవిస్తుంది. ఎలుకలు అనుభవిస్తున్న ఈ చిత్రవధను ఆపాలంటూ పెటా చేసిన పోరాటం ఫలించింది. అందుకే దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు మన దేశంలో  ‘ర్యాట్ గ్లూ ప్యాడ్స్’(Rat Glue Traps)  విక్రయాలను ఆపేశాయి.

Also Read :World Backup Day 2024 : వాట్సాప్‌లో డేటా బ్యాకప్ ఎలాగో తెలుసా ?