World Backup Day 2024 : వాట్సాప్‌లో డేటా బ్యాకప్ ఎలాగో తెలుసా ?

World Backup Day 2024 : డిజిటల్ యుగమిది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు ఇలా ప్రతీ డివైజ్‌లోనూ అత్యంత కీలకమైన అంశం ‘బ్యాకప్’.

  • Written By:
  • Updated On - March 30, 2024 / 12:43 PM IST

World Backup Day 2024 : డిజిటల్ యుగమిది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు ఇలా ప్రతీ డివైజ్‌లోనూ అత్యంత కీలకమైన అంశం ‘బ్యాకప్’. ఏదైనా డివైజ్ కంటే అందులోని డేటాయే ముఖ్యమైనదని టెక్ నిపుణులు చెబుతుంటారు. మన డివైజ్‌లోని సమాచారం చెక్కుచెదరకుండా , దాన్ని భద్రంగా నిక్షిప్తం చేసే మహత్తర మాధ్యమం ‘బ్యాకప్’! ఏటా మార్చి 31న మనం ‘వరల్డ్ బ్యాకప్ డే’ జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది మంది డేటా లీకవుతోంది. 2023 సంవత్సరంలో ఒక్క అమెరికాలోనే దాదాపు 35.3 కోట్ల మంది డేటా లీక్ రిస్క్‌ను ఎదుర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

వాట్సాప్‌లో బ్యాకప్ ఇలా.. 

అన్ని ఫోన్లకు బ్యాకప్ తప్పనిసరిగా ఉండాలి. ఇది ఛాట్‌లు, ఫోటోలు, ఫైల్‌లు, స్టిక్కర్‌లను పునరుద్ధరించడానికి ఉపయోగకరమైన సాధనం. ప్రముఖ మెసేజింగ్ యాప్ “వాట్సాప్”  మీ ఫైల్‌లను సేవ్ చేసే బ్యాకప్ ఫెసిలిటీని కూడా కలిగి ఉంది. మీరు అనుకోకుండా మీ వాట్సాప్ చాట్ హిస్టరీని క్లియర్ చేసినా, అప్లికేషన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసినా లేదా కొత్త ఫోన్‌ని కొన్నా, మీరు మీ డేటాను మళ్లీ రికవర్ చేయొచ్చు. కొన్నిసార్లు పేలవమైన ఇంటర్నెట్ కనెక్షన్ లేదా మాన్యువల్ సెట్టింగ్‌లు మీ బ్యాకప్‌ను ప్రభావితం చేయొచ్చు. మీరు తిరిగి ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు WhatsApp ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, మీ డేటా తాజాగా మరియు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడం కీలకం. మీరు Google డ్రైవ్ లేదా Android టాబ్లెట్ మరియు ఫోన్ స్టోరేజీలో మీ బ్యాకప్‌ని చెక్ చేయొచ్చు. చివరి బ్యాకప్ ఎప్పుడు జరిగిందో కూడా మీరు చూడొచ్చు.

Google Drive యాప్‌లో..

  • Google Drive యాప్‌లో WhatsApp బ్యాకప్‌ ఆప్షన్ ఉంటుంది.
  • తొలుత Google డిస్క్‌ని తెరవండి.
  • ఎగువ ఎడమ మూలలో ఉన్న మెనూను క్లిక్ చేయండి.
  • బ్యాకప్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • అక్కడ WhatsApp బ్యాకప్‌ ఫీచర్ కనిపిస్తుంది.
  • అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ని చూడటానికి బ్యాకప్ పక్కన ఉన్న మూడు చుక్కల చిహ్నం కనిపిస్తుంది.
  • దీన్ని శాశ్వతంగా తొలగించడానికి, ‘బ్యాకప్‌ను తొలగించు’ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆపై నిర్ధారించడానికి ‘తొలగించు’ అనే ఆప్షన్‌ను నొక్కండి.
  • ఫ్యూచర్ బ్యాకప్‌లను ఆపడానికి ‘‘బ్యాకప్ ఆఫ్’’ అనే ఆప్షన్ ఉంటుంది. ఆపై దాన్ని నిర్ధారించడానికి ‘ఆఫ్’ బటన్ నొక్కాలి.

Also Read :USA : పాక్‌‌ ప్రధాని షెబాజ్ షరీఫ్‌కి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేఖ

వాట్సాప్‌లో మనం ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. రోజుల తరబడి వాడినప్పుడు ఇందులోని సమాచారం పెద్ద మొత్తంలో పోగుబడి ఉంటుంది. ఒకవేళ కొత్త మొబైల్‌ కొన్నప్పుడు ఈ డేటా అవసరం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో పాత మొబైల్‌లోని డేటా మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు బ్యాకప్‌ ఆప్షన్‌ను వినియోగిస్తుంటాం. మళ్లీ కొత్త ఫోన్‌లో రీస్టోర్‌ చేస్తుంటాం. ఇలా బ్యాకప్‌ చేయకుండా కూడా వాట్సప్‌లోని చాట్‌ హిస్టరీని కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. ఇందుకోసం వాట్సప్‌ చాట్ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే బ్యాకప్‌ కంటే ఈ ప్రక్రియ చాలా వేగంగానూ, సులభంగానూ ఉంటుంది. ఇందుకోసం రెండు (పాత, కొత్త) ఫోన్లూ మీ వద్దే ఉండాలి. అవి రెండు ఒకే వైఫైకి కనెక్ట్‌ అయ్యి ఉండడంతో పాటు, లొకేషన్‌ సర్వీసు కూడా ఆన్‌లో ఉంచాలి.

కొత్త ఫోన్‌లోకి డేటా ట్రాన్స్‌ఫర్‌ ఇలా..

  •  ముందు మీ పాత ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
  •  చాట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  •  చాట్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ మీ పాత ఫోన్‌లో ప్రారంభం అవుతుంది. ఇక్కడో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది.
  •  తర్వాత కొత్త ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్‌ చేయాలి. అదే ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి.
  •  పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌ను కొత్త దాంట్లో ఎంటర్‌ చేయాలి.
  •  కొత్త ఫోన్‌లో చూపించే క్యూఆర్‌ కోడ్‌ను పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్‌ చేయాలి.
  •  ఆ తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి బదిలీ అవుతుంది.
  •  కొన్ని నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రక్రియ సమయంలో రెండు ఫోన్లూ పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్‌లూ ఆన్‌లోనే ఉంచాలి.

Also Read : Bharat Ratna For PV: పీవీకి భారతరత్న.. అందుకున్న కుటుంబ సభ్యులు, వీడియో..!