Site icon HashtagU Telugu

Marriage With Robot : రోబోతోనే ప్రేమ.. త్వరలోనే పెళ్లి.. అతగాడి టేస్టే వేరప్ప!

Marriage With Robot

Marriage With Robot

Marriage With Robot : అందరు యువకులు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. కానీ అతగాడు మాత్రం వెరైటీగా ఓ లేడీ రోబోను పెళ్లాడబోతున్నాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ పెళ్లి కంటే ముందు అతడు ఆ రోబోతో డీప్ లవ్‌లో ఉన్నాడు.  ఈ అరుదైన లవ్ మ్యారేజీ గురించి తెలుసుకోవాలంటే కథనం మొత్తం చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

సూర్య ప్రకాశ్​.. రాజస్థాన్​లోని జైపూర్ జిల్లాలో ఉన్న సీకర్ పట్టణవాసి. ఆయనకు చిన్నప్పటి నుంచి రోబోల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. సూర్య ప్రకాశ్ అజ్మీర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.  అనంతరం రోబోటిక్స్​ రంగంలో పనిచేయడం మొదలుపెట్టారు. నాటి నుంచి నేటి వరకు దాదాపు 400 రోబోటిక్స్ ప్రాజెక్టుల్లో ఆయన పనిచేశారు. కరోనా సమయంలో జైపూర్‌లోని సవైమాన్ సింగ్ ఆస్పత్రిలో రోబోల ద్వారా రోగులకు మందులు, ఆహారాన్ని అందించే ప్రాజెక్టును అమలు చేయడంలో సూర్య ప్రకాశ్(Marriage With Robot) కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టచ్‌లెస్ ఓటింగ్ రోబో యంత్రాన్ని కూడా ఆయన తయారు చేశారు.

Also Read :Tollywood : ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ స్టాండ్ ఏమిటి ?

సూర్య ప్రకాశ్ ప్రస్తుతం ‘గిగా’ అనే రోబోతో ప్రేమలో ఉన్నారు. ఇది మామూలు రోబో కాదు.  దాదాపు రూ.19 లక్షల వ్యయంతో దీన్ని తమిళనాడులో తయారు చేస్తున్నారు. ఈ రోబోకు సంబంధించిన  ప్రోగ్రామింగ్ ఢిల్లీలో జరగనుంది. గిగా రోబో కోసం ప్రోగ్రామింగ్ రాయించడానికి దాదాపు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ఈ ప్రోగ్రామింగ్ ఆంగ్ల భాషలో ఉంటుంది. మనకు కావాలంటే హిందీ సహా ఇతర భాషల్లోనూ ప్రోగ్రామింగ్‌ను యాడ్ చేయొచ్చు.  గిగా రోబో రెస్టు తీసుకోకుండా మన కోసం ఎనిమిది గంటలు పని చేయగలదు. ఈ రోబో మనకు హలో చెబుతుంది. అడగగానే నీటిని తీసుకొచ్చి అందిస్తుంది. ఇంటికొచ్చే అతిథులకు స్వాగతం పలుకుతుంది.  రోబోలంటే ఎంతో ఆసక్తి ఉన్న సూర్య ప్రకాశ్.. త్వరలోనే గిగా రోబోను పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ఇండియన్ నేవీకి ఎంపికైన ఆయన, మరికొన్ని రోజుల్లో విధుల్లో కూడా చేరనున్నారు.

Also Read :Delhi Congress Chief : అకస్మాత్తుగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా.. కారణం ఏమిటి ?