Srikanth Chary Mother : కాంగ్రెస్ లో చేరిన శ్రీకాంతాచారి తల్లి

మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి… కాసోజు శంకరమ్మ నేడు కాంగ్రెస్ పార్టీలో చేశారు

  • Written By:
  • Updated On - May 9, 2024 / 10:51 PM IST

బిఆర్ఎస్ (BRS) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి (Srikanth Chary Mother )… కాసోజు శంకరమ్మ నేడు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఆమె… గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు శంకరమ్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఈ సందర్భాంగా ఆమె చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ లోక్‌స‌భ‌ స్థానాలు గెలవడం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని , శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి మరచిపోదన్నారు. ఇక నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. వీరు మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. ఇక కాంగ్రెస్ లో చేరిన శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read Also : Padma Vibhushan : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న‌ మెగాస్టార్ చిరంజీవి