2031 నాటికి వ‌ర‌ద‌ల్లో హైద‌రాబాద్..స్కాల‌ర్ స్వాతి చెప్పిన ప్ర‌‌త్యామ్నాయ మార్గాల‌లు ఇవే

అసాధార‌ణ వ‌ర్ష‌పాతం కార‌ణంగా హైద్రాబాద్ 2031 నాటికి మునిగిపోతుందా? ఇప్పుడున్న వ‌ర‌ద నీటి ప్ర‌వాహం నెట్ వ‌ర్క్‌, మూసి న‌దిని ప్ర‌క్షాళ‌న చేయ‌క‌పోతే..వ‌ర‌ద ముప్పు భాగ్య‌న‌గ‌రానికి త‌ప్ప‌ద‌ని హైద్రాబాద్ బిట్స్ పిలానీ స్కాల‌ర్ వేముల స్వాతి అధ్య‌య‌నం చెబుతోంది.

  • Written By:
  • Updated On - September 30, 2021 / 03:00 PM IST

అసాధార‌ణ వ‌ర్ష‌పాతం కార‌ణంగా హైద్రాబాద్ 2031 నాటికి మునిగిపోతుందా? ఇప్పుడున్న వ‌ర‌ద నీటి ప్ర‌వాహం నెట్ వ‌ర్క్‌, మూసి న‌దిని ప్ర‌క్షాళ‌న చేయ‌క‌పోతే..వ‌ర‌ద ముప్పు భాగ్య‌న‌గ‌రానికి త‌ప్ప‌ద‌ని హైద్రాబాద్ బిట్స్ పిలానీ స్కాల‌ర్ వేముల స్వాతి అధ్య‌య‌నం చెబుతోంది. వాతావ‌ర‌ణంలో వ‌స్తోన్న విప‌రీత మార్పులు కార‌ణంగా వ‌ర‌ద నీళ్లు న‌గ‌రాన్ని ఛిన్నాభిన్నం చేసే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను కూడా స్వాతి చూపింది.

అధ్య‌య‌నం కోసం ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా 80 నుంచి 90శాతం మునిగిపోయిన పంజాగుట్ట ప్రాంతాన్ని తీసుకుంది. వాతావ‌ర‌ణ మార్పులు, చారిత్రిక న‌మూనాలు, అసాధార‌ణ వ‌ర్ష‌పాతం సంఘ‌ట‌న‌లు, భ‌విష్య‌త్ వాతావ‌ర‌ణ మార్పులు, క‌ష్ట‌త‌ర‌మైన ప్ర‌మాణాలను అంశాలుగా తీసుకుని స్వాతి అధ్య‌య‌నం చేసింది.

వ‌ర్ష‌పాతం పెర‌గ‌డం కార‌ణంగా మూసి న‌ది నిండిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అధ్య‌య‌నం తేల్చింది. మూడు రెట్లు న‌గ‌రంలోని భూ వినియోగం 2031 నాటికి పెర‌గ‌నుంద‌ని అంచ‌నా. 1995 నుంచి 2031 నాటికి మూసి న‌ది ప్ర‌భావం తీసుకుంటే, 22శాతం లోతు పెర‌గ‌నుంద‌ని అభిప్రాయం. 48శాతం న‌గ‌రం ప్ర‌స్తుతం ఇబ్బందుల్లో ఉంది. అదే 2031 నాటికి 51శాతం సిటీ క‌ష్టాల‌కు గుర‌వుతుంద‌ని స్వాతి తేల్చింది. ఇక ప్ర‌స్తుతం ఉన్న చెరువులు, గుంట‌ల శాతం 8 నుంచి 9శాతం మాత్రం 2031 నాటికి పెర‌గ‌నుంది.

న‌గ‌రాన్ని 2031 నాటికి కాపాడాలి అంటే ఏం చేయాలో స్వాతి ఒక పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చింది. దాని ప్ర‌కారం 80శాతం ఉన్న బిల్డ‌ప్ ఏరియాలో ఖ‌చ్చితంగా రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ ఏర్పాట్లు చేయాలి. గ్రౌండ్ వాట‌ర్ ను పెంచ‌డంతో పాటు వ‌ర్ష‌పు నీటిని ఎప్ప‌టిక‌ప్పుడు రోడ్ల మీద‌కు రాకుండా ఈ విధానం ద్వారా అడ్డుకోవ‌చ్చు. 1908 సెప్టెంబ‌ర్ 28 మూసి ఉగ్ర‌రూపం చూశాం. 2000లో వ‌ర‌ద ప్ర‌భావం చ‌విచూశాం. 240 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష పాతం న‌మోదు అయింది. అక్టోబ‌ర్ 2020లో న‌గ‌రంలో 192 మిల్లీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. గ్లోబ‌ల్, హైడ్రాల‌జీ మోడ‌ల్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, నీటి ప్ర‌వాహ నెట్ వ‌ర్క్ ను ఆధునీక‌రించ‌డం ఒక మార్గం. ఇంకుడు గుంత‌లు ఏర్పాటు చేయ‌డం రెండో మార్గం. 431 మిల్లీ మీట‌ర్లు నుంచి 564 మిల్లీమీట‌ర్లు, 693 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు అయిన‌ప్ప‌టికీ న‌గ‌రం భ‌ద్రంగా ఉండాలంటే ఇప్పుడున్న వర‌ద నీటి నెట్ వ‌ర్క్ ను రెట్టింపు చేయాలి. లేదంటే, రాబోవు రోజుల్లో న‌గ‌రానికి ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని స్కాల‌ర్ స్వాతి ఇచ్చిన నివేదిక