Drugs and Ganja : వెహికల్స్ ఆపుతూ.. వాట్సాప్ చాట్స్ చెక్ చేస్తూ..!

గత పది, పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా డ్రగ్స్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో లెక్కకు మించి గంజాయి, డ్రగ్స్ లభ్యమవుతుండటంతో తెలుగు రాష్ట్రాల ముఖమంత్రులు కఠిన చర్యలకు దిగుతున్నారు.

  • Written By:
  • Updated On - October 28, 2021 / 04:19 PM IST

గత పది, పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా డ్రగ్స్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో లెక్కకు మించి గంజాయి, డ్రగ్స్ లభ్యమవుతుండటంతో తెలుగు రాష్ట్రాల ముఖమంత్రులు కఠిన చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ గంజాయి సాగు చేస్తున్నవాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా గంజాయి సాగు చేసినట్టు రుజువైతే, ఆ భూములకు సంబంధించిన పట్టాలు, ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక ఏపీ సీఎం జగన్ విద్యాసంస్థల దగ్గర నిఘా పెట్టాలని, డ్రగ్స్ అణచివేయాలని సూచనలు చేశారు. డ్రగ్స్ వ్యవహరం తెలుగు రాష్ట్రాలకు తలనొప్పిగా మారడంతో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు చెక్ పోస్టుల దగ్గర నిఘా వేసి అక్రమార్కులను అరెస్ట్ చేశారు. నిఘా పెంచినా డ్రగ్స్ దందా కు ఫుల్ స్టాప్ పడకపోవడంతో హైదరాబాద్ లోని పలు ప్రధాన రహదారులను చెక్ పాయింట్లుగా చేసుకొని వాహనాదారులకు చెక్ చేస్తున్నారు.

 గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో గంజాయిని చలామణి చేస్తున్నవాళ్లను గుర్తించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో దాడులు, సోదాలు నిర్వహించాలని ‘కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌’ ఆదేశాల మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. రోడ్లపై వాహనాలను ఆపడం, మొబైల్స్ ను చేతుల్లోకి తీసుకోవడం, సంబంధిత చాట్‌లు ఉన్నాయో లేదోనని చెక్ చేయడం లాంటివి చేస్తున్నారు. అంతేకాకుండా.. మొబైల్స్ లో గంజాయి లాంటి కీపింగ్ పదాలను కూడా చెక్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే వాట్సాప్ చాట్స్ చెక్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజరావు భూపాల్ మాట్లాడారు. ‘‘ఫోన్‌లను తనిఖీ చేస్తున్నట్లు నాకు తెలుసు. అయితే, మేము ఎవరినీ బలవంతం చేయడం లేదు. తనిఖీల పేరుతో ఫోన్స్ లాక్కోవడం లేదు. ప్రజలు సహకరిస్తున్నారు. కాబట్టి పోలీసులు తనిఖీ చేస్తున్నారు’’ అని సమాధానం ఇచ్చారు.

అయితే పోలీసులు అడిగినప్పుడు ప్రజలు తమ ఫోన్లను ఇవ్వకుండా తిరస్కరించే అవకాశం ఉందా అని అడిగినప్పుడు తమ ఫోన్‌ను ఇవ్వడాన్ని తిరస్కరించవచ్చు. అయితే, ఆ తర్వాత ఎలాంటి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయో చూడాలి. ఇప్పటివరకు, మేము అలాంటి సమస్యను ఎదుర్కోలేదు. ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. వస్తే పరిశీలిస్తాం’’ అని అన్నారు. అయితే ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత అంతర్గతంగా ఉంటుందని, రాజ్యాంగంలోని పార్ట్ III కింద హామీ ఇవ్వబడిన ఇతర స్వేచ్ఛలు అని కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది కారం కొమిరెడ్డి మాట్లాడుతూ..  ఫోన్‌లను తనిఖీ చేయడానికి పోలీసులు ఏ చర్య తీసుకున్నా గోప్యతకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. వ్యక్తుల ఫోన్‌లను యాదృచ్ఛికంగా తనిఖీ చేసే హక్కు పోలీసులకు ఉండదు. పౌరుల అనుమతి లేకుండా ఫోన్లను చెక్ చేయడం చట్ట విరుద్దం అన్నారు.