Site icon HashtagU Telugu

Ex MP Sircilla Rajaiah : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

Ex Mp Sircilla Rajaiah Is A

Ex Mp Sircilla Rajaiah Is A

తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ (State Finance Commission Chairman)గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య (Ex MP Sircilla Rajaiah)ను సర్కారు నియమించింది. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులుగా ఎం.రమేశ్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రెండేళ్ల పాటు వీరు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కార్పొరేషన్‌లను రద్దు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన పలు నామినేటేడ్ పోస్టులకు కొందరు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌ పదవికి భూపాల్ రెడ్డి రాజీనామా చేశారు. భూపాల్ రెడ్డి రిజైన్ చేయడంతో ఖాళీగా ఉన్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా గవర్నర్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల రాజయ్య వరంగల్‌ (ఎస్‌సీ) పార్లమెంట్‌ స్థానం నుంచి 15వ లోక్‌సభకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Read Also : Chiranjeevi : ఫోటో చెబుతున్న సీక్రెట్.. సినిమా అనౌన్స్ చేయడమే లేట్..!

Exit mobile version