Abhaya Hastam Status : అభయహస్తం వెబ్‌సైట్‌లో టెక్నికల్ సమస్య.. పరిష్కారమయ్యేనా ?

Abhaya Hastam Status : తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం ద్వారా ‘అభయహస్తం’ దరఖాస్తులను స్వీకరించింది.

  • Written By:
  • Updated On - January 15, 2024 / 09:26 AM IST

Abhaya Hastam Status : తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం ద్వారా ‘అభయహస్తం’ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలోని కోటి 5 లక్షల మంది అప్లికేషన్స్ సమర్పించారు. వీటిని నెల రోజుల్లో ప్రభుత్వం పరిశీలించి, లబ్దిదారుల లిస్టును రిలీజ్ చేయబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి జనవరి 7న ప్రజాపాలన వెబ్‌సైట్ https://prajapalana.telangana.gov.in‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఇందులోనే ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ వెబ్ సైట్‌లోని అప్లికేషన్ స్టేటస్ విభాగం https://prajapalana.telangana.gov.in/Applicationstatus లోకి వెళ్లి ప్రజాపాలన కేంద్రాల దగ్గర ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ రసీదు నెంబరును ఎంటర్ చేయాలి. అనంతరం దాన్ని ప్రభుత్వం ఆమోదించిందా? లేదా? అనేది తెలిసిపోతుంది.ఇక్కడే ఇప్పుడు ప్రాబ్లమ్ తలెత్తుతోంది. అప్లికేషన్ రసీదు నెంబరును ఎంటర్ చేశాక, అక్కడ కింద కనిపించే కాప్చా (captcha) కోడ్‌ను పక్కనున్న ఖాళీ బాక్సులో ఎంటర్  చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత వ్యూ స్టేటస్ ఆప్షన్‌ను  క్లిక్ చేస్తే.. అప్లికేషన్ స్టేటస్ ఏమిటి అనేది  తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో చాలామందికి కాప్చా కోడ్ కనిపించడం లేదు. పక్కనున్న రీ ఫ్రెష్ బటన్‌ను ఎన్నిసార్లు క్లిక్ చేసినా.. కొత్త కాప్చా కోడ్ రావట్లేదు. దాంతో స్టేటస్ తెలుసుకునే వీలు కలగడం లేదు. దీంతో దరఖాస్తు దారులకు తమ అప్లికేషన్ అప్రూవ్ అయ్యిందో లేదో తెలియట్లేదు. ప్రజాపాలన వెబ్‌సైట్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఐతే.. ఈ కాప్చా కోడ్‌ సమస్యను ఈ సంస్థ గుర్తించిందా, దీన్ని సరిచేస్తోందా అన్నది తెలియట్లేదు. పోనీ కాప్చా కోడ్ రావట్లేదని కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా అక్కడ ఆప్షన్ లేదు. అందువల్ల ఇదో సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించి, స్టేటస్ తెలుసుకునే వీలు కల్పించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మీరు ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అప్లై చేశారా ? అయితే మీ కోసమే ఈ అప్‌డేట్.  తెలంగాణ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ప్రస్తుతం ఆయా పథకాలకు సంబంధించిన ప్రభుత్వ వెబ్‌ సైట్‌‌లలో నమోదు చేస్తున్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ దరఖాస్తుదారుల డాటా ఎంట్రీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 17లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లాల అధికార యంత్రాంగాలకు రేవంత్ సర్కారు ఆదేశించింది. తక్కువ జనాభా ఉండే చిన్న జిల్లాలలో ఈ ప్రాసెస్ ఇప్పటికే పూర్తయింది. ఎక్కువ జనాభా ఉండే పెద్ద జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతోంది.  ఈనెల 17లోగా డాటా ఎంట్రీని పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అర్హుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అర్హులైన వారికి ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించే తేదీల  ప్రకారం ఒక్కో పథకం అమల్లోకి వచ్చేస్తుంది. వాటి ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరడం(Prajapalana Update) మొదలవుతుంది.

Also Read: Sankranti – Horoscope : ఇవాళే మకర సంక్రాంతి.. నేటి రాశిఫలాలివీ..

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయితే రేషన్‌కార్డు లేనివారి నుంచి తెల్లకాగితంపై దరఖాస్తులు తీసుకున్నారు. ఇలా తీసుకున్న రేషన్ కార్డుల అప్లికేషన్ల వివరాలను నమోదు చేసేందుకు..సంక్షేమ పథకాల వెబ్‌సైట్‌లో ప్రత్యేక కాలమ్ లేదని అంటున్నారు. మిగిలిన గ్యారంటీల కోసం వచ్చిన అప్లికేషన్ల వివరాలను డిజిటల్ చేస్తున్నా.. రేషన్ కార్డు దరఖాస్తుల సమాచారాన్ని ఎంట్రీ చేయడం లేదని చెబుతున్నారు. ఈ లెక్కన రేషన్‌కార్డులు ఉన్నవారి దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అంటే ఐదు గ్యారెంటీలకు స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తుల్లోనే అర్హులైన వారికి పథకాలను అందించనున్నారు. దరఖాస్తులు సమర్పించని వారు మరో 4 నెలలు అప్లై(Abhaya Hastam Status) చేసుకోవచ్చు.