Space Spying : చైనా శాటిలైట్ల రోబోటిక్ హ్యాండ్..అమెరికా అలర్ట్

Space Spying : స్పేస్ వార్.. ఇది మనం సినిమాల్లోనే చూశాం..భవిష్యత్ లో ఇలాంటివి రియల్ గా జరిగినా ఆశ్చర్యం లేదు..ఇప్పుడు స్పేస్ లోనూ 3 అగ్ర రాజ్యాల మధ్య కొట్లాట ముదురుతోంది.. 

  • Written By:
  • Updated On - June 7, 2023 / 09:12 AM IST

Space Spying : స్పేస్ వార్.. ఇది మనం సినిమాల్లోనే చూశాం..

భవిష్యత్ లో ఇలాంటివి రియల్ గా జరిగినా ఆశ్చర్యం లేదు..

ఇప్పుడు స్పేస్ లోనూ 3 అగ్ర రాజ్యాల మధ్య కొట్లాట ముదురుతోంది.. 

చైనా, రష్యాలపై అనుమానంతో ఉన్న అమెరికా.. స్పేస్ లో వాటి ప్రతి యాక్టివిటీని క్షుణ్ణంగా ట్రాక్ చేస్తోంది. 

ఈక్రమంలోనే చైనా, రష్యా స్పేస్ వెహికల్స్, శాటిలైట్స్ చుట్టూ గూఢచారి శాటిలైట్లను(Space Spying) మోహరించేందుకు రెడీ అవుతోంది.

కొత్తగా అంతరిక్షంలో గూఢచారి ఉపగ్రహాల (స్పై శాటిలైట్స్)ను అమెరికా మోహరించబోతోంది.. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటివారంలో స్పేస్ లోకి వాటిని పంపించనున్నారు. ఈ గూఢచారి ఉపగ్రహాల నెట్ వర్క్ ను  “సైలెంట్ బార్కర్” అని పిలువనున్నారు. ఇప్పుడు ఆ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.అంతరిక్షంలో ఎక్కడ ఏం జరుగుతోంది ? ఏయే శాటిలైట్స్ ఎటు కదులుతున్నాయి ? ఏదైనా శాటిలైట్ కానీ .. స్పేస్ వెహికల్ కానీ అమెరికా శాటిలైట్స్ కు దగ్గరగా వస్తోందా ? అనే సమాచారాన్ని “సైలెంట్ బార్కర్” ప్రాజెక్ట్ లోని గూఢచారి ఉపగ్రహాలు  సేకరిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అంతరిక్షంలో చీమ చిటుక్కుమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.  ఇంతకీ స్పై శాటిలైట్స్ ను అమెరికా ఎందుకు మోహరిస్తోంది ? ఇందుకు బలమైన కారణం ఏదైనా ఉందా ? అమెరికాను భయపెట్టేలా  చైనా, రష్యాలు ఇటీవల కాలంలో  అంతరిక్షంలో ఏం చేశాయి ?  ఇప్పుడు తెలుసుకుందాం..

Also read : SpaceX: ఎలాన్ మస్క్ “స్పేస్ ఎక్స్” హిస్టరీ

చైనా శాటిలైట్ల రోబోటిక్ హ్యాండ్ తో దడ 

అది 2021 నాటి మాట.. ఆ ఏడాది SJ-21 అనే శాటిలైట్ ను చైనా ప్రయోగించింది. ఆ శాటిలైట్ వెళ్లి తనకున్న రోబోటిక్ హ్యాండ్ లాంటి పరికరాలతో ఫెయిల్ అయిపోయిన మరో చైనీస్ శాటిలైట్ ను కొన్ని వందల మైళ్ల ఎత్తులోకి లాక్కొని వెళ్లి ఇంకో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సిజియాన్-17 అనే మరో చైనీస్ ఉపగ్రహానికి ఇలాంటి పవర్ ఫుల్ రోబోటిక్ హ్యాండ్ ఉంది. దాని సాయంతో అది ఏ శాటిలైట్ ను అయినా.. ఏ స్పేస్ వెహికల్ ను అయినా లాక్కొని వెళ్లి తప్పుడు కక్ష్యలో వదిలేయగలదు.

Also read : Super Earth: ఆ రెండు గ్రహాలపై ఏడాదికి 18 గంటలే.. “జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్” ఫోకస్ వాటిపైనే!!

రష్యా దగ్గర స్పేస్ వార్ టెక్నాలజీ 

రష్యాకు కూడా ఈ టెక్నాలజీని చైనా అందించి ఉంటుందని అమెరికా భావిస్తోంది. ఇక రష్యా దగ్గర అంతరిక్షంలోని శాటిలైట్లను పేల్చేయగల ఆయుధ సంపత్తి ఉంది. రష్యా,  చైనా దగ్గరున్న స్పేస్ వార్ టెక్నాలజీ రిస్క్ గా మారకముందే అందుకు విరుగుడును అమెరికా తయారు చేస్తోంది. అందుకే స్పేస్ లో  వాటి ప్రతి యాక్టివిటీపై కన్నేసి ఉంచేందుకు “సైలెంట్ బార్కర్” పేరుతో గూఢచారి ఉపగ్రహాల టీమ్ ను పంపుతోంది.