Battery Life: మొబైల్ ఫోన్ తో ఇలా చేస్తే బ్యాటరీకి లైఫ్ ఉండదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో కనీసం రెండు మూడు స్మార్ట్ ఫోన్లు

  • Written By:
  • Updated On - August 5, 2022 / 03:21 PM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో కనీసం రెండు మూడు స్మార్ట్ ఫోన్లు అయినా ఉంటున్నాయి. అదే పెద్ద కుటుంబాలు అయితే అయిదారు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్లకే ఎడిక్ట్ అయిపోయారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ చార్జింగ్. మొబైల్ కొనుగోలు చేసిన తర్వాత కొద్ది రోజులపాటు బాగానే ఛార్జింగ్ వచ్చినప్పటికీ ఆ తరువాత రాను రానూ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ సేపు ఉండవు.

అయితే ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్ లో అనేక రకాల యాప్స్ రన్నింగ్ లో ఉండటం, అనవసరమైన యాప్స్ ని యూజ్ చేయడం వల్ల కూడా చార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అయితే మొబైల్లో ఛార్జింగ్ ఇంట్లో ఉన్నప్పుడు తగ్గితే పర్లేదు కానీ ప్రయాణం చేసినప్పుడు ఇలా చార్జింగ్ తగ్గిపోతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి మొబైల్ ఫోన్ ను చార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు ప్రతి సారి పవర్ బ్యాంకులను వాళ్లతో తీసుకెళ్తూ ఉంటారు.

అయితే మొబైల్ ఫోన్లో చార్జింగ్ తగ్గిపోవడానికి మరొక ముఖ్య కారణం కంపెనీ చార్జర్లకు బదులుగా వేరే చార్జర్లను వాడటం. ఇలా మొబైల్ ఫోన్లకు ఆయా కంపెనీ చార్జర్లు కాకుండా వేరే చార్జింగ్ వైర్లు ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. అంతేకాకుండా చాలాసార్లు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినా కూడా చార్జింగ్ లోనే ఉంచుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా బ్యాటరీ తో పాటు ప్రాసెసర్ కూడా దెబ్బతింటుంది. అదేవిధంగా మొబైల్ ఫోను వేడి వాతావరణం లో ఉంచకూడదు. కొంతమంది అయితే 40 లేదా 50% చార్జింగ్ రాగానే చార్జింగ్ తీసేసి మొబైల్ ఫోన్ ని ఉపయోగించడం తగ్గిపోగానే మళ్లీ చార్జింగ్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా పదే పదే ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ కూడా పాడవ్వుతుంది. పోర్ట్ పాడవ్వుతుంది. కాబట్టి ఇలా పదే పదే మొబైల్ ఫోన్లు చార్జింగ్ పెట్టకూడదు.