Site icon HashtagU Telugu

Seconds Before Death : మనం మరణించే ముందు బ్రెయిన్ లో ఏం జరుగుతుంది…?

Before Death

Before Death

మరణం…ఒక మిస్టరీ. మరణించే ముందు మనం మెదడు ఏం ఆలోచిస్తుంది. మరణం తర్వాత ఏం జరుగుతుంది. ఈ రెండూ ఇప్పటికీ అంతులేలని ప్రశ్నలే. వాటి గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే శాస్త్రవేత్తలు ఎన్నాళ్ల నుంచో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఓ అరుదైన అవకాశం చిక్కింది. మరణించే ముందు కొన్ని నిమిషాలు అతని మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసుకునే వీలు కలిగింది….ఎలాగంటే..అమెరికాలో 87ఏళ్ల వయస్సున్న మూర్చరోగి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అతని మూర్చలను గుర్తించేందుకు డాక్టర్లు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫీ చేశారు. అయితే సడెగా రోగి హాట్ స్ట్రోక్ తో మరణించాడు. ఇలా జరగడం వల్ల మరణిస్తున్న వ్యక్తి మెదడు ఆలోచించడాన్ని లేదా కార్యచరణను రికార్డు చేసేందుకు శాస్త్రవేత్తలు ఛాన్సే దొరికింది. అతని మరణిం…ఆ సమయంలో మెదడు చేస్తున్న పనిని EEG పరికరం రికార్డు చేసింది ఈ పరిశోధనా వివరాలను స్కై న్యూస్ తోపాటుగా ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరో సైన్స్ జర్నల్ లో ప్రచురితమైంది. వీటి ప్రకారం రోగికి అమర్చిన ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ మరణానికి ముందు…మరణం తర్వాత కలిపి దాదాపు పదిహేను నిమిషాలపాటూ జరిగిన మార్పులను రికార్డు చేస్తూనే ఉంది.

ఏం తేల్చారు…?
ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ మెషీన్ రోగి మరణించే ముందు చివరి గుండె చప్పుడు ఇరువైపులా 30 సెకన్లలో మెదడులో ఒక నిర్దిష్టరకమైన తరంగాలను కలిగిందని తేల్చారు. అందులో పెరుగుదల అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మెదడు తరంగాలను గామా తరంగాలు..అవి అధునాతనమైన కాగ్నిటివ్ విధులను కలిగి ఉటాయి. అంటే ఏకాగ్రత, కలలు కనడం, ధ్యానం, జ్ఝాపకాలు, సమాచారన్ని ప్రాసెస్ చేయడం వంటి పనుల్లో ఇవి చురుకుగా పనిచేస్తాయ. శాస్త్రవేత్తలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం…రోగి గుండె కొట్టుకోవడం ఆగిపోయే ముందు …తర్వాత గామా తరంగాల్లో పెరుగుదల కనిపించింది. అంటే మరణించడానికి ముందు తన జీవితం అంతా కూడా ఒక ఫ్లాష్ లు ఉండొచ్చు. జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. అయితేఈ ప్రక్రియ అంతా కూడా ఒక అధ్యయనంగా భావించలేమని..అనుకోకుండా బయటపడిన ఒక పరిశోధన ఫలితంగానే చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరి క్షణాల్లో ఏం జరుగుతుందో…లోతుగా అర్థం చేసుకోవల్సిన విషయాలు, శోధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు చేయాల్సి వస్తుందని వారు తెలిపారు.