Summer: వేసవికాలంలో ఈ 5 విషయాలతో మీ కారుని రక్షించుకోండిలా?

వేసవికాలం మొదలయ్యింది.. ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలి అంటేనే జనం

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 04:30 PM IST

వేసవికాలం మొదలయ్యింది.. ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలి అంటేనే జనం భయపడుతున్నారు. ఎండలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఇప్పటికే చాలామంది వడదెబ్బ కారణంగా మరణిస్తున్నారు. దీంతో చాలామంది గొడుగు ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది మనుషులు ఏదో ఒక రకంగా కవర్ చేసుకుంటారు. మరి వాహనాల పరిస్థితి ఏమిటి అంటే ఆలోచించకు తప్పదు. మరి ముఖ్యంగా కార్ల పరిస్థితి ఏంటి అంటే? ఆలోచించాల్సిందే. కాబట్టి వేసవికాలంలో మీ కారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఐదు రకాల విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఆ 5 విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండాకాలం వచ్చింది అంటే చాలు కారులో కచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. కాబట్టి సమ్మర్ వస్తోంది అంటే ఒకసారి ఏసీ ని చెక్ చేయించుకోవడం మంచిది. సరిగ్గా ఉందా లేదా లేదంటే ఏసీ ఫిల్టర్ ని క్లీన్ చేయించుకోవడం అవసరమైతే ఏసీ ఫిల్టర్ ని మార్చడం లాంటివి చేయాలి. డాష్ బోర్డు లో ఉండే ఏసీ బటన్లు ఏసీ కంట్రోల్స్ ని కూడా చెక్ చేయించుకోవాలి. రెండవ అంశం విషయానికొస్తే.. కారు అద్దం నీటిగా ఉండాలి అన్నా చక్కగా రోడ్డు కనిపించాలి అన్న విండ్ షీల్డ్ పైపర్స్ చాలా ముఖ్యం. విండ్ షీల్డ్ ఎండకు వేడెక్కుతుంది కాబట్టి వైపర్స్ డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసవికి ముందే వాటిని చెక్ చేయించుకుని వైపర్ బ్లేడ్స్ చేయించుకోవడం మంచిది.

మూడవ అంశం.. వేసవికాలంలో కారుకి మంచి లైఫ్ ఉన్న టైర్ లను ఎక్కువగా ఉపయోగించాలి. ఎప్పటికప్పుడు టైర్లలో గాలిని చెక్ చేస్తూ ఉండాలి. పరిమితికి నుంచి గాలి పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. పరిమితికి నుంచి గాలి పెట్టడం వల్ల ఎండకు టైర్లలో ప్రజర్ పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేసవికాలం లాంగ్ జర్నీ చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే రెండు గంటలకు ఒకసారి కారు ఆపి కారుకు రెస్టు ఇవ్వడం మంచిది. ఇక నాలుగవ అంశం.. ఎయిర్ ఫిల్టర్స్ వేసవిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గాలిని శుద్ధి చేసి ఇంజిన్ లోకి పంపుతాయి. ముఖ్యంగా ఎండా కాలంలో గాలిలో కాలుష్య కారకాలు, ఉద్ఘారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వేసవిలో కారుకి ఎయిర్ ఫిల్టర్స్ నీట్ గా ఉండడం ఎంతో మంచిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వేసవిలో కారు నీడకు పార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కానీ ఎండలో వదిలేస్తే పైన తెలుసుకున్న విషయాలు చేసిన పనులన్నీ కూడా వృధా అయినట్లే. సాధ్యమైనంతవరకు నీడలోనే కార్ ని పార్క్ చేయడానికి ప్రయత్నించాలి..