Spyware On Phone: మీ ఫోన్ లో స్పై వేర్ అయితే లేదు కదా? ఇలా చెక్ చేసుకోండి!!

  • Written By:
  • Publish Date - August 20, 2022 / 05:00 PM IST

ఈ మధ్యన స్మార్ట్ ఫోన్ల వాడకం భారీగా పెరిగింది. దీంతో హ్యాకర్లకు స్మార్ట్ ఫోన్లు కూడా టార్గెట్‌గా మారాయి. ప్రతి 10 మొబైల్స్‌లో నాలుగు మొబైల్స్ మాల్‌వేర్‌ల బారిన పడుతున్నాయని గ్లోబల్ రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. ఈ తరుణంలో మీ ఫోన్ హ్యాకింగ్ గురి కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం..

కొన్ని సంకేతాలు..

ఫోన్ హ్యాక్ అయిందో లేదో చెప్పడం అంత తేలిక కాదు. కానీ ఫోన్‌లో కొన్ని వింత పరిణామాలు జరిగినప్పుడు మాత్రం మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని కనిపెట్టొచ్చు.
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? కొన్ని సింపుల్‌ సంకేతాలను బట్టి సులువుగా కనిపెట్టొచ్చు.

బ్యాటరీ దిగిపోతుంటుంది..

బ్యాటరీ వెంటనే దిగిపోతుంటుంది.. మీ ఫోన్‌ కొంచెం సమయం వాడినా ఛార్జింగ్ వెంట వెంటనే తగ్గిపోతూ ఉందంటే.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాకయ్యిందేమోనని అనుమానించాలి.

డేటా వేగంగా అయిపోవడం..

మీ ఫోన్‌ డేటా వేగంగా అయిపోవడం. అవును.. మీ ఫోన్ డేటా స్పీడ్‌గా ఐపోతున్నా, ఫోన్‌ హ్యాక్ అయ్యిందేమోనని సందేహించాల్సిందే! ఎందుకంటే ఒక ఫోన్‌కు సంబంధించిన యూజర్ వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీకి చేరితే, ఆ ఫోన్‌ నుంచి సైబర్ నేరగాళ్లు నిరంతరంగా సమాచారం సేకరిస్తూనే ఉంటారు. అందువల్ల ఇంటర్నెట్ డేటా వేగంగా ఖర్చవుతుంది.

ఫోన్ సడన్‌గా క్రాష్..

మీ ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు ఫోన్ సడన్‌గా క్రాష్ అయినట్లయితే, మీ ఫోన్‌పై వైరస్ దాడి చేసిందని లేదా ఫోన్ హ్యాక్ చేయబడిందని గ్రహించాలి.

ప్రతీది హ్యాకర్ల చేతిలోకి..

మొబైల్ ఫోన్లలోకి వైరస్‌లు వచ్చినప్పుడు, మీ ఫోన్ పనిచేయడం తగ్గిపోతుంది.మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది. మీకు తెలియకుండానే మీ కాంటాక్ట్‌లకు స్పామ్ మెసేజ్‌లు వెళ్తాయి. మీ స్క్రీన్, లొకేషన్, కీబోర్డు ఇన్‌పుట్‌లు ఇలా ప్రతీది హ్యాకర్ల చేతిలోకి వెళ్తాయి.

ఇతర ముఖ్య అంశాలు..

* మొబైల్ బిల్లింగ్ ఛార్జీలు పెరుగుతాయి.
* అసాధారణమైన పాప్‌-అప్‌లు తెరుచుకుంటాయి.
* ఊహించని విధంగా మీ డివైజ్ వేడెక్కుతుంది.

తక్షణ రక్షణ ఇలా…

* ఫోన్ హ్యాంకింగ్ కు గురి అయినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి..? అంటే.. తొలుత
మాల్‌వేర్‌ను తొలగించాలి.
* ఆ తర్వాత కొన్ని ట్రబుల్‌షూటింగ్ చర్యలు తీసుకోవాలి.
* మీ ఫోన్‌ను మాల్‌వేర్ బారి నుంచి కాపాడుకునేందుకు యాంటీ వైరస్ యాప్‌లను వాడాలి.
* కొన్ని ప్రముఖ వెండార్లు పెయిడ్, ఫ్రీ ప్రొటెక్షన్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని అవాస్ట్, ఏవీజీ, బిట్‌డిఫెండర్, మ్యాక్‌ఫీ లేదా నార్టాన్‌.
* మీ ఫోన్ స్టోరేజ్‌ను, క్యాచీలను(ఆండ్రాయిల్ డివైజ్‌లలో) క్లియర్ చేసుకోవాలి. బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్‌సైట్ డేటాను(ఆపిల్ డివైజ్‌లలో) క్లియర్ చేసుకోవాలి.
* సురక్షితంగా ఉంచుకునేందుకు మీ ఐఫోన్‌ను, ఆండ్రాయిడ్ ఫోన్‌ను రీస్టార్ట్ చేసుకోవాలి..
* మీ డౌన్‌లోడెడ్ యాప్‌ల జాబితాలో ఏమైనా అనుమానిత లేదా తెలియని యాప్స్ ఉంటే డిలీట్ చేయాలి.
*/ మీ డేటాను అంతా బ్యాకప్‌గా పెట్టుకుని మీ ఫోన్‌ను రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమైనా మాల్‌వేర్‌లు ఉంటే పోతాయి.

ముందు జాగ్రత్త ఇలా..

* అసాధారణమైన పాప్ అప్‌లను క్లిక్ చేయొద్దు.
* టెక్ట్స్ మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులు, ఈమెయిల్స్‌‌లో ఉన్న లింక్‌లను క్లిక్ చేయకుండా ఉంటే మంచిది.
* గూగుల్ ప్లే లేదా ఆపిల్ ప్లే స్టోర్ నుంచే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* మీ ఫోన్‌ను మాడిఫై చేయొద్దు.
* ఇన్‌స్టాల్ చేసుకునే ముందు యాప్ పర్మిషన్లు చూసుకోవాలి. మీ డేటాను బ్యాకప్‌గా పెట్టుకోవాలి.
* తాజా వెర్షన్లకు మీ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్ డేట్ చేసుకోవాలి.